Ghaziabad: ఘ‌జియాబాద్ లో వీధి కుక్క‌ల గుంపు ప‌దేళ్ల బాలిక‌పై దాడి చేసింది. అయితే, అటుగా వ‌చ్చిన ఒక బైక‌ర్ కుక్క‌ల‌ను అటునుంచి త‌రిమేయ‌డంలో బాలిక ప్రాణాలతో బ‌య‌ట‌ప‌డింది. ఈ వీధి కుక్క‌ల దాడికి సంబంధించిన భ‌యాన‌క దృశ్యాలు అక్క‌డి సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి.  

12-year-old girl attacked by stray dogs: దేశంలోని ప‌లు ప్రాంతాల్లో పెరుగుతున్న కుక్క‌ల దాడులు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. ఇటీవ‌ల జ‌రిగిన ప‌లు కుక్క‌ల దాడుల్లో ప‌లువురు ప్రాణాలు కోల్పోగా, చాలా మంది తీవ్ర‌గా గాయ‌ప‌డ్డార‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఘజియాబాద్ లో కుక్క‌ల బెడ‌ద అధికంగా ఉంద‌ని రిపోర్టులు పేర్కొంటున్న త‌రుణంలో మ‌రో భ‌యాన‌క ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఘ‌జియాబాద్ సోసైటీలో వీధి కుక్క‌ల గుంపు ప‌దేళ్ల బాలిక‌పై దాడి చేశాయి. అయితే, అటుగా వ‌చ్చిన ఒక బైక‌ర్ కుక్క‌ల‌ను అటునుంచి త‌రిమేయ‌డంలో బాలిక ప్రాణాలతో బ‌య‌ట‌ప‌డింది. ఈ వీధి కుక్క‌ల దాడికి సంబంధించిన భ‌యాన‌క దృశ్యాలు అక్క‌డి సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి.

వివ‌రాల్లోకెళ్తే.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని ఘజియాబాద్ లోని ఓ సొసైటీ క్యాంపస్ లో 12 ఏళ్ల బాలికపై వీధి కుక్కల గుంపు దాడి చేసింది. రాజ్ నగర్ ఎక్స్ టెన్షన్ లోని నంద్ గ్రామ్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన కెమెరాలో రికార్డయింది. 49 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో మైనర్ బాలిక తనను తాను రక్షించుకోవడానికి ప్ర‌య‌త్నించింది. అయితే, వీధి కుక్కల గుంపు చుట్టుముట్టుముట్ట‌డంతో పాటు ఆమెపై దాడిని ప్రారంభించాయి. పెద్ద‌గా అర‌వ‌డంతో దూరం జ‌రిగిన కుక్క‌లు మ‌ళ్లీ దాడి చేయ‌డం ప్రారంభించాయి. 

వీధి కుక్క‌ల దాడితో బాలిక సహాయం కోసం కేకలు వేస్తుంటే.. కుక్కలు ఆమెను క‌ర‌వ‌డం ప్రారంభించాయి. అయితే, అటుగా వెళ్తున్న ఒక డెలివరీ బాయ్ త‌న బైకును ఆపి బాలికను వీధి కుక్కల బారి నుంచి కాపాడాడు. ఈ వీధి కుక్క‌ల దాడికి సంబంధించిన భ‌యాన‌క దృశ్యాలు అక్క‌డి సీసీటీవీ కెమెరాల‌లో రికార్డు అయ్యాయి. స్థానికుల వీధి కుక్క‌ల బెడ‌ద‌ను తొల‌గించాల‌ని అధికారులను కోరుతున్నారు.

Scroll to load tweet…

ఇదిలావుండ‌గా, మరో ఘటనలో ఘజియాబాద్ లోని పంచశీల్ సొసైటీలో 23 ఏళ్ల మహిళ 79 ఏళ్ల వ్యక్తిపై దాడి చేసిన ఘటన అక్క‌డి కెమెరాకు చిక్కింది. వీధి కుక్కలకు ఆహారం పెట్టాలని వృద్ధుడు సిమ్రాన్ అనే మహిళను కోరడంతో మొదలైన వాగ్వాదం త్వరగా ఘ‌ర్ష‌ణ‌కు దారితీసింద‌ని స‌మాచారం.

Scroll to load tweet…