సారాంశం

రాష్ట్ర ముఖ్యమంత్రిని చంపుతామని 12 ఏళ్ల బాలుడు బెదిరింపులకు దిగాడు.  పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి మరీ ఈ బెదిరింపులకు దిగాడు స్కూల్ విద్యార్ది. ఈ విచారణలో  సీఎం ను చంపుతామని బెదిరించింది మైనర్ బాలుడని కేరళ పోలీసులు గుర్తించారు.

తిరువనంతపురం: కేరళ సీఎం పినరయి విజయన్ ను చంపేస్తామని  12 ఏళ్ల బాలుడు బెదిరించారు. రాష్ట్రంలోని ఎర్నాకుళం జిల్లాకు చెందిన  బాలుడు  కేరళ సీఎం ను చంపేస్తామని పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి బెదిరింపులకు దిగాడు. ఈనెల  1వ తేదీన  సాయంత్రం పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఈ ఫోన్ కాల్ పై  పోలీసులు దర్యాప్తు చేపట్టారు.సీఎం ను చంపుతామని బెదిరించింది  

12 ఏళ్ల బాలుడిగా  పోలీసులు గుర్తించారు. ఈ ఫోన్ రాగానే  పోలీస్ కంట్రోల్ రూమ్  పోలీసులు  సంఘటనై మ్యూజియం పోలీసులు కేసు నమోదు చేశారు.   కేరళ సీఎం విజయన్ ను చంపుతామని  బెదిరించినట్టుగా గుర్తించారు. 12 ఏళ్ల బాలుడు ఈ ఫోన్ ఎందుకు చేశారనే విషయమై  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.