పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన ఓ అభ్యర్థికి వింత అనుభవం ఎదురైంది. అతని కుటంబంలో 12 ఓట్లు ఉండగా.. అతడికి వచ్చింది మాత్రం ఒకే ఓటు. ఈ ఫలితాలు చూసి అందరూ ఖంగుతిన్నారు. ఈ విచిత్రమైన ఘటన గుజరాత్ లో చోటు చేసుకుంది. 

వారిది పెద్ద కుటుంబం. అందులో అంద‌రికి దాదాపు 12 మందికి ఓటు హ‌క్కు ఉంది. ఆ కుటుంబం నుంచి ఒక‌రు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పోటీకి దిగారు. సాధార‌ణంగా అయితే గ్రామంలో పెద్ద కుటుంబం కాబ‌ట్టి, ఆ అభ్య‌ర్థికి గ్రామంలో మంచి పేరు ఉంటే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌క‌పోయినా.. క‌నీసం పోటీ ఇచ్చే అవ‌కాశం ఉంటుంది. ఆ గ్రామ‌స్తలంద‌రూ అదే అనుకున్నారు. ఎన్నిక‌లు జ‌రిగాయి. ఫ‌లితాల కోసం అంద‌రూ ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు. వారి ఉత్కంఠ‌కు తెర‌దించుతూ సాయంత్రం ఫ‌లితాలు వ‌చ్చేశాయి. కానీ ఫలితాలను చూసి అంద‌రూ షాక్ తిన్నారు. ఏ అభ్య‌ర్థి అయితే తీవ్ర పోటీ ఇస్తారనుకున్నారో ఆ అభ్య‌ర్థికి కేవ‌లం ఒకే ఓటు వ‌చ్చింది. క‌నీసం ఆ కుటుంబంలో ఉన్న 12 ఓట్లు కూడా రాలేదు. దీంతో అంద‌రూ నోరెళ్ల‌బెట్టారు. ఆ కుటుంబ స‌భ్యులు అంద‌రూ ఓటు వేసినా కూడా 12 ఓట్లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. కానీ అలా జ‌ర‌గ‌లేదు. బ‌హుషా వ‌చ్చిన ఆ ఒక్క ఓటు కూడా ఆ అభ్య‌ర్థి వేసుకున్న‌దే త‌ప్ప వేరే ఏ ఇత‌ర ఓట్లు ప‌డ‌లేదు. ఈ విచిత్ర‌మైన ఘ‌ట‌న గుజ‌రాత్ రాష్ట్రంలో జ‌రిగింది. 

కుక్క పిల్లకు సోనూ పేరు పెట్టినందుకు.. పొరుగువారు ఆమెకు నిప్పంటించారు..!

కౌంటింగ్ సెంట‌ర్లోనే రోదించిన అభ్య‌ర్థి..
ఎన్నిక‌లు అంటేనే ఓ పెద్ద ప‌రీక్ష‌. ఇందులో ఎవ‌రు పాస్ అవుతారో, ఎవ‌రు ఫెయిల‌వుతారో చెప్ప‌డం చాలా క‌ష్టం. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌లైన నుంచి పోలింగ్ జ‌రిగే వ‌ర‌కు ఓ పెద్ద డ్రామా జ‌రుగుతూనే ఉంటుంది. నామినేష‌న్ వేసిన ద‌గ్గ‌ర నుంచి వెన్నంటి ఉండి ప్రోత్స‌హించిన వ్యక్తులే చివ‌రి స‌మ‌యంలో ఎలా మారిపోతారో తెలియ‌దు. వెంట తిరిగిన నాయ‌కుల కుటుంబ స‌భ్యులే కాదు కొన్ని సార్లు ఆ నాయ‌కులు కూడా ఓటు ఆ అభ్య‌ర్థికి ఓటు వేయ‌క‌పోవ‌చ్చు. ఎన్నిక‌ల ముందు రోజు వ‌ర‌కు బాగానే ఉన్న కార్య‌క‌ర్తలు ఓకే రోజు ప్లేటు ఫిరాయించ‌వ‌చ్చు. త‌మ అభ్య‌ర్థికి ఓటు వేయాల‌ని ప్ర‌చారం చేసిన నాయ‌కులే.. రాత్రికి రాత్రి ప్ర‌తిప‌క్ష అభ్య‌ర్థికి ఓటు వేయాల‌ని సూచించ‌వ‌చ్చు. ఇలాంటి ఘ‌ట‌నలు జ‌రుగుతూనే ఉంటాయి. పార్ల‌మెంటుకు జ‌రిగే ఎన్నిక‌ల నుంచైతే పంచాయ‌తీకి జ‌రిగే ఎన్నిక‌ల వ‌ర‌కు ఇలాంటి ఉదంతాలు క‌నిపిస్తూనే ఉంటాయి. కానీ గుజ‌రాత్‌లో జ‌రిగిన ఘ‌ట‌న మాత్రం దీనికి పూర్తిగా విరుద్ధం. 

తమకిష్టంలేని పెళ్లి చేసుకుందని... కూతురు తాళి తెంచిన తండ్రి.. జుట్టుపట్టి రోడ్డుమీద ఈడ్చుకెడుతూ..
ఎన్నిక‌ల్లో పోటీ చేసిన అభ్య‌ర్థికి సొంత పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, ఓట‌ర్లు మ‌ద్ద‌తు ఇవ్వ‌క‌పోయినా.. కుటుంబ స‌భ్యులు మాత్రం వెన్నంటే ఉంటారు. ఆ కుటుంబ స‌భ్యుడిని గెలిపించ‌డానికి కృషి చేస్తారు. ప్ర‌తీ ఇంటికి తిరిగి ఓట్లు అభ్య‌ర్థిస్తారు. క‌లిసిన వారందరినీ ఓటు వేయాల‌ని కోరుతారు. ఆ అభ్య‌ర్థికి మాన‌సికంగా, ఆర్థికంగా మ‌ద్ద‌తు తెలిపుతారు. ఇక్క‌డ కూడా అలాగే జరుగుతుంద‌ని అందరూ అనుకున్నారు. కానీ ఫ‌లితం వ‌చ్చాక మాత్రం అంద‌రూ షాక్ అయ్యారు. గుజారాత్ రాష్ట్రంలోని వాపి జిల్లా చ‌ర్వాల గ్రామానికి చెందిన సంతోష్ కు ఈ విచిత్ర‌మైన అనుభ‌వం ఎదురైంది. త‌న గ్రామంలో నిర్వ‌హించే పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో స‌ర్పంచ్ ప‌ద‌వి కోసం పోటీలో నిల‌బ‌డ్డాడు. అత‌ని కుటుంబంలో 12 ఓట్లు ఉన్నాయి. కానీ ఫ‌లితాలు చూసుకుంటే అత‌డికి ఓకే ఓటు వ‌చ్చింది. అది కూడా త‌న‌దే అని నిర్ధారించుకున్నాడు. ఈ ఫలితాలలో ఇలాంటి అనుకోని అనుభవం ఏర్ప‌డ‌టంతో కౌంటింగ్ సెంట‌ర్లోనే తీవ్రంగా రోదించాడు. త‌న కుటుంబ స‌భ్యులే త‌కుకి ఓటు వేయ‌లేద‌ని తీవ్రంగా ఆవేద‌న చెందాడు. ఈ వార్త ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.