చుట్టుపక్కలవారి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మోడల్‌ను కాపాడాలని భావించారు. అయితే మోడల్, తాను ప్రేమించుకున్నామని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు పోలీసులకు వీడియో కాల్ ద్వారా తెలిపారు రోహిత్.
ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందనే కారణంతో ఓ వ్యక్తి తన ప్రియురాలిని దాదాపు 12గంటలపాటు ఓ గదిలో బంధించాడు. అక్కడితో ఆగలేదు. ఆమె నుదిటి దగ్గర గన్ పెట్టి బెదిరించి మరీ.. చివరకు పెళ్లికి ఒప్పించాడు. ఆమె ఒక ప్రముఖ మోడల్ కావడంతో.. ఈ విషయం పెద్ద సంచలనంగా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళితే...భోపాల్‌కు చెందిన 30 ఏళ్ల మోడల్, ఉత్తర ప్రదేశ్‌కు చెందిన రోహిత్ గత కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. ముంబైలో రోహిత్ సైతం మోడలింగ్ చేస్తున్నట్లు సమాచారం. ప్రేమ విషయం తెలుసుకున్న మోడల్ తల్లిదండ్రులు రోహిత్‌తో కూతురి పెళ్లికి నిరాకరించారు. దీంతో చేసేదేంలేక ఆమె కూడా ప్రియుడితో పెళ్లికి వెనకడుగు వేశారు.
ఈ విషయంలో రోహిత్‌పై.. మోడల్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో అతడు కొంతకాలం జైలుశిక్ష అనుభవించి బయటకొచ్చాడు. ఈ క్రమంలో మరోసారి తనను పెళ్లి చేసుకోవాలని అడిగేందుకు భోపాల్‌లోని మిస్రాడ్ ఏరియాలోని మోడల్ అపార్ట్‌మెంట్‌కు శుక్రవారం ఉదయం 6గంటల ప్రాంతంలో వెళ్లాడు రోహిత్. ఐదో అంతస్తులో నివాసం ఉంటున్న మోడల్ ఇంట్లోకి ప్రవేశించి డోర్ లాక్ చేశాడు.
చుట్టుపక్కలవారి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మోడల్‌ను కాపాడాలని భావించారు. అయితే మోడల్, తాను ప్రేమించుకున్నామని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు పోలీసులకు వీడియో కాల్ ద్వారా తెలిపారు రోహిత్. ఈ క్రమంలో 12 గంటలు గడిచిపోయాయి. పెళ్లి గురించి మరోసారి ఆరాతీయగా వివాహం చేసుకుంటానని ఆమె చెప్పారు.
పెళ్లికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్టాంప్ పేపర్ మీద సంతకాలు సేకరించాడు. ఇంట్లో నుంచి బయటకురాగానే రోహిత్‌తో పాటు మోడల్‌ను అదుపులోకి తీసుకుని హాస్పిటల్‌కు తరలించినట్లు ఎస్పీ రాహుల్ లోధా తెలిపారు. అయితే.. అతను ఆమెను గన్ తో బెదిరించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.
