Asianet News TeluguAsianet News Telugu

గోవాలో కేటుగాళ్లు.. పర్యాటకుల ఫోన్లే టార్గెట్.. కట్ చేస్తే.. 12మంది అరెస్ట్, రూ.30 లక్షలు, 41 ఫోన్లు స్వాధీనం

గోవాకు వచ్చే సందర్శకుల ఫోన్లు కొట్టేస్తున్న ముఠాలను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. రెండు ముఠాలకు చెందిన 12మందిని అదుపులోకి తీసుకున్నారు.వీళ్ల నుంచి రూ.30 లక్షల నగదుతో పాటు 41 బ్రాండెడ్‌ ఫోన్లు, రెండు టయోటా కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

12 gang members held for theft of phones, 41 mobiles worth Rs 30L seized
Author
First Published Dec 30, 2022, 3:10 AM IST

గోవా హాలిడే స్పాట్ కు కేరాఫ్.. నిత్యం వేలాది మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు. స్పెషల్ ఫెస్టివల్స్‌, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం దేశ నలుమూలల నుంచి టూరిస్ట్‌లు ఇక్కడికి చేరుకున్నారు. పుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే అదనుగా భావించే కేటుగాళ్లు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తుంటారు. వందలాది ఫోన్లను కొట్టేస్తుంటారు. అయితే.. ఈ విషయం పోలీసుల ద్రుష్టికి వెళ్లడంతో  ముందుగానే ఫోన్ దొంగలను పోలీసులు పట్టుకున్నారు.

గోవాలో జరుగుతున్న ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ (ఈడీఎం) ఫెస్టివల్‌లో నేర కార్యకలాపాలు పాల్పడుతున్న  12 మంది దొంగలను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.30 లక్షల నగదుతో పాటు 41 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న రెండు టయోటా ఇన్నోవా కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. 

ఈ ఘటనపై  పోర్వోరిమ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విశ్వేష్ కర్పే మాట్లాడుతూ.. కలాంగుట్‌లో ఒక పర్యాటకుడు మొబైల్ దొంగతనం గురించి ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణలో మహారాష్ట్ర నుంచి 12 మందితో కూడిన రెండు ముఠాలను ఫోన్లు దొంగిలించేందుకు వచ్చినట్లు తేలిందని అన్నారు.

దీంతో అప్రమత్తమైన తాము  బగ, కలంగూట్ ప్రాంతాల్లో పర్యాటకుల ఫోన్లు దొంగిలిస్తున్న గుర్తించామనీ, వారి గురించి మాటు వేసి మరీ పట్టుకున్నమని తెలిపారు. ఉత్తర గోవాలో జరుగుతున్న సన్‌బర్న్ ఈఎండీ ఫెస్టివల్‌, రానున్న నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఈ రెండు ముఠాలు ఇలాంటి నేరాలకు పాల్పడేందుకు గోవాకు చేరుకున్నాయని విశ్వేష్ కర్పే తెలిపారు.

అలాగే.. ఈ ఘటనపై నార్త్ గోవా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) నిధిన్ వల్సన్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు 12 మంది వ్యక్తుల ముఠాను అరెస్టు చేశామని, వారి నుండి 41 మొబైల్ ఫోన్‌లు, ప్రధానంగా ఆపిల్ ఐఫోన్‌లు , ఇతర ఖరీదైన ఫోల్డబుల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న రెండు టయోటా ఇన్నోవా కార్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు వల్సన్ తెలిపారు.

పూణేకు చెందిన జితేష్ మెహతా .. తన హాలీ డేస్ ను గడపడానికి గోవాకు వచ్చారు. అతడు బీచ్ కు వెళ్లున్న సమయంలో ఓ కేటుగాడు తన చేతివాటాన్ని ప్రదర్శించి.. తన జేబులోంచి శామ్‌సంగ్ ఫోల్డ్ Z3 లాక్కున్నాడు. బాధితుడు వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాధితుడి పిర్యాదు మేరకు కలాంగుట్ పోలీస్ స్టేషన్ సిబ్బంది నిందితుడి కోసం వెతకడం కొనసాగించారు.

CCTV ఫుటేజీని ధృవీకరించిన తర్వాత నిందితుడు కలంగుట్‌లోని బాగా వద్ద ఉన్న హోటల్‌లో గుర్తించారు. క్షుణ్ణంగా విచారించిన తర్వాత.. భారతదేశంలోని వివిధ ప్రాంతాల నివాసితులైన మహారాష్ట్రకు చెందిన 12 మందితో కూడిన రెండు ముఠాలు ప్రత్యేకంగా మొబైల్ ఫోన్లను దొంగిలించడానికి గోవాకు వచ్చినట్లు వెలుగులోకి వచ్చిందని వల్సన్ చెప్పారు.

గోవాలో క్రిస్మస్ చాలావరకు శాంతియుతంగా గడిచిపోయింది, కొత్త సంవత్సరం కూడా ఎటువంటి పెద్ద సంఘటనలు లేకుండా గడిచిపోయేలా చూసుకోవడానికి తాము తగు చర్యలు  తీసుకుంటున్నామని వల్సన్ చెప్పారు. నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో పర్యాటకులు రావడంతో గోవా పోలీసులు.. డ్రగ్స్ పెడ్లర్లు, టౌట్స్,ఇతర చట్టాన్ని ఉల్లంఘించే ఇతర ముఠాల కోసం పెట్రోలింగ్, నిఘా కోసం బృందాలను ఏర్పాటు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios