110యేళ్ల వయసులో ఆ బామ్మకు పునర్జన్మ.. కొత్త దంతాలు, వెంట్రుకలు.. ఘనంగా రీబర్త్ సెలబ్రేషన్స్.. ఎక్కడంటే..
ఓ 110యేళ్ల బామ్మ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమెకు ఈ వయసులో కొత్త దంతాలు, కొత్త వెంట్రుకలు రావడమే దీనికి కారణం. దీంతో పునర్జన్మ అంటూ వేడుకలు చేస్తు్న్నారు.
పశ్చిమ బెంగాల్ : పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఓ 110యేళ్ల బామ్మకు కొత్తగా పళ్లు, జుట్టు వస్తున్నాయి. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. డాక్టర్లు కూడా ఇది అరుదైన ఘటన అనడంతో.. బామ్మకు కుటుంబసభ్యులంతా కలిసి ఆమె మరోసారి పుట్టిందంటూ రీ బర్త్ వేడుకలు నిర్వహించారు. మామూలుగా వందేళ్లకు పైబడి జీవించేవారు అక్కడక్కడా కనిపిస్తూనే ఉంటారు. గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కువ కాలం బతికిన వ్యక్తులుగా తమ పేరు నమోదు కూడా చేసుకుంటారు. అయితే వృద్ధాప్య ఛాయలు అలాగే ఉంటాయి తప్పితే.. కొత్తగా అప్పుడే పుట్టిన పాపాయిలా శరీరంలో మార్పులు కనిపించవు. కానీ, ఇక్కడ ఈ బామ్మ విషయంలో అది జరిగింది. దీంతో దీన్ని అరుదైన ఘటనగా అభివర్ణిస్తున్నారు.
ఆ బామ్మ పేరు సఖిబాలా మోండల్. వయసు 110 ఏళ్లు. ఆమెకు ఇప్పుడు కొత్తగా పళ్లు, జుట్టు వస్తున్నాయి. దీంతో ఇది చూసిన స్థానికులు ఆశ్చర్యంతో నోరు వెళ్లబెడుతున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని బడ్జ్ బడ్జ్ నియోజకవర్గంలో ఈ ఘటన జరిగింది. దీంతో సఖిబాలా మోండల్ కుటుంబసభ్యులు ఆమెకు ఘనంగా రీబర్త్ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో చాలా మంది స్థానికులతో పాటు.. ప్రత్యేక అతిథిగా బడ్జ్ బడ్జ్ నంబర్ 2 బ్లాక్ వైస్ ప్రెసిడెంట్ బుచన్ బెనర్జీతో సహా పలువురు పెద్దలు ఈ వేడుకకు హాజరయ్యారు.
శాలరీలో కోత పెట్టాడని.. మూడేళ్ల తరువాత ఎస్సైని చంపిన కానిస్టేబుల్..
సఖిబాలా మోండల్ 110 ఏళ్ల వయసులో తన 80 ఏళ్ల కుమార్తె, మనవరాళ్లు, వారి పిల్లలతో కలిసి తన రీబర్త్ వేడుకలు జరుపుకున్నారు. ఏది ఏమైనప్పటికీ, ఆమె కొత్త పళ్ళు, వెంట్రుకలు 'పునర్జన్మ' అనే అంశం ప్రత్యేకంగా నిలిచింది.
అయితే, 110యేళ్ల వయసులో కొత్త దంతాలు రావడం మీద ఓ సీనియర్ డాక్టర్ మాట్లాడుతూ.. ఈ రకంగా జరగడం చాలా అరుదు. అయితే అసాధ్యం మాత్రం కాదు. ఎందుకంటే కొత్త వెంట్రుకలు, దంతాలు రావాలంటే శరీరానికి అవసరమైన ఎక్కువ మొత్తంలో కాల్షియం, ఇతర ఖనిజాలు కావాలి. అయితే వృద్ధుల్లో వీటి శాతం లోపించడం వల్ల ఇళా జరగదు. కానీ సఖిబాలా మోండల్ కేసులో ఇది సాధ్యమయ్యింది. ఓ సంవత్సరం క్రితం ఘటల్ దగ్గర ఓ వందేళ్ల వృద్ధురాలికి కొత్త దంతాలు వచ్చాయి... అని చెప్పుకొచ్చారు.