Asianet News TeluguAsianet News Telugu

పిడుగుపాటులో 18 మంది మృతి.. 4 ల‌క్ష‌ల సాయం ప్ర‌క‌టించిన స‌ర్కారు

Bihar lightning deaths: బీహార్ లో ఉరుములు మెరుపుల‌తో కూడిన వ‌ర్షం ప‌డుతోంది. ఈ క్ర‌మంలోనే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పిడుగులు ప‌డ‌టంతో 18 మంది మరణించారు. ప్ర‌భుత్వం మృతుల కుటుంబాల‌ను ఆదుకుంటామ‌ని పేర్కొంటూ రూ.4 లక్షల సాయం ప్రకటించింది. వ‌ర్షాల నేప‌థ్యంలో ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ప్ర‌భుత్వం సూచించింది. 
 

11 people died in lightning.. Govt announced 4 lakh aid
Author
First Published Sep 20, 2022, 12:18 PM IST

Bihar lightning deaths: బీహార్ లో ఉరుములు మెరుపుల‌తో కూడిన వ‌ర్షం ప‌డుతోంది. ఈ క్ర‌మంలోనే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పిడుగులు ప‌డ‌టంతో 18 మంది మరణించారు. ప్ర‌భుత్వం మృతుల కుటుంబాల‌ను ఆదుకుంటామ‌ని పేర్కొంటూ రూ.4 లక్షల సాయం ప్రకటించింది. వ‌ర్షాల నేప‌థ్యంలో ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ప్ర‌భుత్వం సూచించింది. 

వివ‌రాల్లోకెళ్తే..  బీహార్ లోని తొమ్మిది జిల్లాల్లో సోమవారం జరిగిన విషాదకర సంఘటనలో కనీసం 18 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలోని ప‌లు చోట్ల ఉరుములు మెరుపుల‌తో కూడిన వ‌ర్షం కురిసింది. ఈ క్ర‌మంలోనే పిడుగుపాటుకు గురై 18 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు ఈ ఏడాదిలో పిడుగుపాటు కార‌ణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 216కు చేరుకుంది. తాజాగా పిగుడుపాటుతో మ‌ర‌ణాలు సంభ‌వించిన ప్రాంతాల్లో పూర్ణియా (4), అరారియా (4), సుపౌల్ (3), జముయి (2), బంకా, బెగుసరాయ్, షేక్పురా నవాడా, శరన్లు ఉన్నాయ‌ని రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం గణాంకాలు చెబుతున్నాయి.

మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్ గ్రేషియా

ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బాధిత కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి ₹ 4 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కారణంగా పూర్నియా, అరారియా, సుపాల్ ప్రాంతాల్లో మ‌ర‌ణాలు సంభ‌వించాయ‌ని ముఖ్య‌మంత్రి కార్యాల‌యం అంత‌ముకుందు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. "బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.. చనిపోయిన వారిపై ఆధారపడిన వారికి వెంటనే ₹ 4 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని" ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్ తెలిపారు. ప్రతికూల వాతావరణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ, ప్రమాదాలు జరగకుండా విపత్తు నిర్వహణ శాఖ జారీ చేసిన సూచనలను పాటించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. "ప్ర‌తికూల వాతావ‌ర‌ణం ఉన్న ప్రాంతాల్లో ప్ర‌జ‌లు జాగ్ర‌త‌త్త‌గా ఉండండి.. ఈ ఆయా స‌మ‌యాల్లో ఇండ్ల‌ల్లో ఉండండి" అని ముఖ్య‌మంత్రి తెలిపారు. 

వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు 

ఇప్ప‌టికే రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో ఉరుములు మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు ప‌డుతున్నాయి. మంగ‌ళ‌వారం కూడా రాష్ట్రంలో వ‌ర్షాలు కురుస్తాయ‌ని భార‌తీయ వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) హెచ్చ‌రించింది. దక్షిణ బీహార్ జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పాట్నా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే, 
ముంబయి, పూణేల్లో రానున్న 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. తుఫాను సర్క్యులేషన్ కారణంగా ఉరుములు మెరుపులు ఏర్పడడం వల్ల పిడుగుపాటు దుర్ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయ‌ని పాట్నా వాతావరణ విభాగం అధికారి ఆశిష్ కుమార్ సింగ్ తెలిపారు. 

దక్షిణ, తూర్పు బీహార్ లో పిడుగుపాటు సంఘటనలు జరిగాయి. వాయువ్య, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా వచ్చే తేమతో కూడిన గాలిని కలపడం వల్ల వాతావరణానికి అంతరాయం కలగడం వల్ల ఈ మెరుపులు సంభవించాయని ఆశిష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో పిడుగుపాటు ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. గత రెండేళ్లలో పిడుగుపాటుకు 900 మందికి పైగా మరణించారు. గ్లోబల్ వార్మింగ్ కారకాలతో పాటు రాష్ట్ర స్థానం కారణంగా బీహార్ లో తరచుగా పిడుగుపాటు ఘ‌ట‌న‌లు జరుగుతున్నాయని నిపుణులు పేర్కొన్నారు. ఈ ఏడాది జూలైలో బీహార్ లో అత్యధిక మరణాలు సంభవించాయని నివేదిక సూచిస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios