నాలుగేళ్ల ప్రాయంలో స్పానిష్‌ ఫ్లూ.. 106 ఏళ్ల వయసులో కరోనా: రెండు మహమ్మారులను ఓడించిన తాతయ్య

జీవితంలో రెండు మహమ్మారులపై విజయం సాధించి వైద్యులను సైతం ఆశ్చర్యపరిచాడో తాతయ్య

106 year old delhi man who was child during spanish flu beats covid-19

కరోనా వైరస్ కారణంగా ప్రపంచం తలకిందులైపోతోంది. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఈ మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. మన జీవితాన్ని కాపాడుకోవాలంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాల్సిందేనని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఈ క్రమంలో జీవితంలో రెండు మహమ్మారులపై విజయం సాధించి వైద్యులను సైతం ఆశ్చర్యపరిచాడో తాతయ్య. వివరాల్లోకి వెళితే.. దేశ రాజధాని ఢిల్లీలో వందేళ్ల కిందట ప్రపంచాన్ని కబళించిన స్పానిష్ ఫ్లూను తట్టుకున్న వ్యక్తి తాజాగా మరో మహమ్మారి కోవిడ్ 19 బారినపడి సులువుగా కోలుకున్నారు.

Also Read:జైల్లో తోటి ఖైదీ ద్వారా కరోనా: మాజీ ఎమ్మెల్యే మహేందర్ యాదవ్ మృతి

ప్రస్తుతం ఆయన వయసు 106 ఏళ్లు. ఢిల్లీలోని కోవిడ్ 19 కేంద్రంలో చికిత్స పొందుతూ 70 ఏళ్ల తన కుమారుడి కంటే ఆయన వేగంగా కోలుకున్నారు. రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నుంచి తన భార్య, కుమారుడు, మరో కుటుంబ సభ్యుడితో కలిసి ఆ వృద్ధుడు ఇటీవలే డిశ్చార్జి అయ్యారని వైద్యులు తెలిపారు.

1918లో ప్రపంచాన్ని వణికించిన స్పానిష్ ఫ్లూ ప్రభావాన్ని ఆయన ఎదుర్కొన్నారని డాక్టర్లు చెబుతున్నారు. సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ ప్రకారం.. చరిత్రలో 1918 ఇన్‌ఫ్లూయెంజా (స్పానిష్ ఫ్లూ) అత్యంత ప్రమాదకరమైన మహమ్మారిగా నిలిచిపోయింది.

Also Read:'కొవాగ్జిన్' పై వివాదం: అన్ని పరిశీలించాకే ట్రయల్స్‌కు అనుమతి... ఐసీఎంఆర్‌ ప్రకటన

హెచ్1ఎన్1 అనే వైరస్ ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది. అయితే ఇది ఎక్కడ పుట్టిందనే దానిపై ఖచ్చితమైన ఆధారాలు లేవు. 1918-1919 మధ్య ప్రాంతంలో ఈ స్పానిష్ ఫ్లూ ప్రపంచం మొత్తానికి పాకింది.

దీని కారణంగా అప్పట్లో 40 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని డబ్ల్యూహెచ్ఓ అంచనా. ఇందులో ఒక్క భారతదేశంలోనే 14 మిలియన్ల మంది చనిపోయి ఉంటారని వాదన కూడా ఉంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios