Asianet News TeluguAsianet News Telugu

'కొవాగ్జిన్' పై వివాదం: అన్ని పరిశీలించాకే ట్రయల్స్‌కు అనుమతి... ఐసీఎంఆర్‌ ప్రకటన

 దేశ ప్రజల ప్రయోజనాలు, భద్రతను దృష్టిలో పెట్టుకుని వేగవంతంగా వ్యాక్సిన్ తయారు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. లోతైన పరిశీలన, డేటా విశ్లేషణ తర్వాతే కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్‌కు అనుమతిస్తామని స్పష్టం చేసింది. 

ICMR Clarity Over Bharath Biotech Covid 19 Vaccine And Clinical Trials
Author
New Delhi, First Published Jul 5, 2020, 11:55 AM IST

న్యూఢిల్లీ:  దేశ ప్రజల ప్రయోజనాలు, భద్రతను దృష్టిలో పెట్టుకుని వేగవంతంగా వ్యాక్సిన్ తయారు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. లోతైన పరిశీలన, డేటా విశ్లేషణ తర్వాతే కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్‌కు అనుమతిస్తామని స్పష్టం చేసింది. భారత్‌ బయోటెక్‌ టీకా ప్రయత్నాలపై ఐసీఎంఆర్ శనివారం ప్రకటన విడుదల చేసింది.

కాగా కరోనా మహమ్మారి కట్టడి చేయడానికి హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్‌ ‘కోవాగ్జిన్‌’ను మానవులపై ప్రయోగించేందుకు భారత డ్రగ్‌ కంట్రోలర్‌ అనుమతి లభించిన విషయం తెల్సిందే. 

ఈ విషయమై క్లినికల్‌ ట్రయల్స్‌లో పాల్గొనే వారు ఈ నెల 7లోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని, ఆగస్టు 15వ తేదీలోగా కోవాగ్జిన్‌ను ఆవిష్కరించాలంటూ ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరామ్‌ భార్గవ గురువారం లేఖ రాయడం పట్ల వైద్య నిపుణులు, పరిశోధనా వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. అదే విధంగా మానవులపై ట్రయల్స్‌ జరగకముందే వ్యాక్సిన్‌ విడుదలకు తేదీని ఎలా ఖరారు చేస్తారని విమర్శలు వ్యక్తమయ్యాయి.

వ్యాక్సిన్ తయారీ విషయమై వచ్చిన విమర్శల నేపథ్యంలోనే ఐసీఎంఆర్ వివరణనిచ్చింది. వ్యాక్సిన్ మీద భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ నిర్వహించిన ప్రీ-క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్నందునే తదుపరి తొలి, మలి దశ క్లినికల్ ట్రయల్స్ కోసం తేవడంలో భాగంగా అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా ప్రయోగాలు చేపడుతున్నామని ఐసీఎంఆర్ పేర్కొన్నది. 

ప్రపంచ స్థాయి ప్రమాణాల మేరకే కరోనా వ్యాక్సిన్ తయారీ, పరీక్షలు నిర్వహిస్తామని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. దేశీయంగా వ్యాక్సిన్ తయారీకి ‘భారత్ బయోటెక్‌’కు అనుమతి ఇచ్చామని.. ఐసీఎంఆర్, నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ వైరాలజీతో కలిసి ఆ కంపెనీ కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తోందని పేర్కొంది.

also read:ఒక్క రోజుకే రూ.1.50 లక్షల బిల్లు: ఫీవర్ ఆసుపత్రి డీఎంఓ నిర్భంధం, సెల్పీ వీడియో

ఈ నేపథ్యంలో శనివారం ఈ మేరకు స్పందించిన ఐసీఎంఆర్‌.. భారత్‌ బయోటెక్‌ ప్రీ క్లినికల్‌ డేటాను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే డ్రగ్స్‌ కంట్రోలర్‌ అనుమతించారని ప్రకటన విడుదల చేసింది. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ అభివ్రుద్ధి కోసం పలు దేశాలు చేపట్టిన చేపట్టిన ప్రయోగాలు వివిధ దశలో ఉన్నాయని ఐసీఎంఆర్ పేర్కొన్నది.

ఈ సమయంలో భద్రత, నాణ్యత, నైతిక విలువలను అనుసరించి దేశీయంగా వ్యాక్సిన్ రూపొందించుకోవడం ఎంతో ముఖ్యమని ఐసీఎంఆర్ పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ రూపకల్పనలో నిమగ్నమైన పరిశోధనా సంస్థలు ఇదే ప్రక్రియను అనుసరిస్తున్నట్లు వెల్లడించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios