Asianet News TeluguAsianet News Telugu

పదేళ్ల కొడుకుని తనఖా పెట్టి.. భర్త అంత్యక్రియలకు అప్పు

ప్రమాదవశాత్తు భర్త చనిపోయాడు. అతని అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా చేతిలో చిల్ల గవ్వలేదు. అందుకే.. అంత్యక్రియల కోసం అప్పు చేసింది.

10-Year-Old Tamil Nadu Boy, Allegedly Traded By Mother For Loan, Rescued
Author
Hyderabad, First Published Mar 7, 2019, 12:09 PM IST

ప్రమాదవశాత్తు భర్త చనిపోయాడు. అతని అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా చేతిలో చిల్ల గవ్వలేదు. అందుకే.. అంత్యక్రియల కోసం అప్పు చేసింది. కుదవ పెట్టడానికి ఆమె దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆస్తి ఆమె కమారుడు. అందుకే నిండా పదేళ్లు కూడా లేని తన కుమారుడిని ఒప్పందం కింద లేబర్ గా పనిచేయించుకోవడానికి కుదవ పెట్టి.. భర్త అంత్యక్రియలు నిర్వహించింది. ఈ దారుణ సంఘటన తమిళనాడు రాష్ట్రం తంజావూరులో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. పదేళ్ల బాలుడు లేబర్ గా ఓ వ్యక్తి వద్ద పనిచేస్తున్నాడు. ఈ విషయాన్ని గమనించిన కొందరు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. బాలకార్మికుల చట్టం కింద పదేళ్ల బాలుడితో పనిచేయించుకోవడం నేరం కాబట్టి.. చర్యలు తీసుకోవడానికి అధికారులు అక్కడికి వచ్చారు. అయితే.. అక్కడ వారికి నమ్మలేని నిజాలు తెలిశాయి.

కన్నతల్లే బాలుడిని కుదవపెట్టిందని తెలుసుకొని షాకయ్యారు. ఆరా తీయగా..  తమిళనాడులో  ఇటీవల గజా తుఫాను వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సదరు మహిళ భర్త చనిపోయాడు. ఉన్న ఇళ్లు కూలిపోయింది. దీంతో.. చేసేదేమీ లేక కొడుకును వారికి అప్పగించి.. భర్త అంత్యక్రియలు నిర్వహించింది.

విషయం పూర్తిగా తెలుసుకున్న అధికారులు బాలుడిని రక్షించారు. అతనిని చైల్డ్ హోమ్ కి తరలించారు. బాలుడుని అప్పుకింద పెట్టుకున్న యజమాని.. రోజుకి 24గంటలు మేకలను కాయమని చెప్పేవాడట. కనీసం ఆహారం పెట్టేవాడు కాదని.. రోజుకి ఒక్కసారి గిన్నెడు గంజి ఇచ్చేవాడని బాలుడు చెప్పాడు. బాలుడికి కనీసం వసతి కూడా లేదు. ఆ మేకల పాకలో.. వాటి పక్కనే పడుకోవాల్సి వచ్చింది.  

దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా బాలుడి పేరు మీద రూ.2లక్షలు ఫిక్స్ డ్ డిపాజిట్ చేసి.. అతనికి మెరుగైన విద్య అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios