లండన్: పంజాబ్ నేషనల్  బ్యాంకులో సుమారు రూ. 11,400 కోట్ల కుంభకోణంలో కీలక పాత్రధారిగా నిందితుడుగా ఉన్న నీరవ్ మోడీ లండన్‌లో ఉద్యోగం చేస్తున్నట్టుగా గుర్తించారు.

లండన్‌లో తల దాచుకొంటున్న  నీరవ్ మోడీని బుధవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు.  మోడీని అరెస్ట్ చేసిన తర్వాత మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చారు.   ఈ సందర్భంగా నీరవ్ మోడీ తరపు న్యాయవాది మోడీ గురించి కోర్టులో వివరించారు. 

మోడీ తరపు న్యాయవాది జార్జి హెఫ్ బుర్నీ స్కాట్  వాదించారు. మోడీ లండన్ ఉద్యోగి అంటూ ఆయన వివరించారు. ప్రతి నెల ఆయన 20 వేల పౌండ్లను సంపాదిస్తున్నాడని నీరవ్ మోడీ  తరపు న్యాయవాది కోర్టులో వివరించారు.గత ఏడాది జూన్ నుండి లండన్‌‌లో నివాసం ఉంటున్నారని, అతని కొడుకు కూడ గత ఐదేళ్లుగా స్థానికంగా పాఠశాలలో చదువుకొంటున్నాడని లాయర్ జార్జి చెప్పారు.

నీరవ్ మోడీ బ్రిటన్‌లో బహిరంగంగానే తిరుగుతున్నాడని స్థానిక బ్రిటన్ సర్కార్‌కు పన్నులు కట్టి డ్రైవింగ్ లైసెన్సు పొందడానికి కూడ ధరఖాస్తులు చేసుకొన్నారని లాయర్ వివరించారు. కానీ, భారత్ తరపున న్యాయవాది జోనాథన్ స్వైన్ కోర్టులో తన వాదనను విన్పించనున్నారు. నీరవ్ మోడీ పెద్ద మోసగాడని ఆయన ఆధారాలతో సహా వివరించారు. ఈ కేసు విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేశారు.

 

సంబంధిత వార్తలు

పీఎన్బీ స్కాం: ఎట్టకేలకు నీరవ్ మోడీ అరెస్ట్