లండన్: నీరవ్ మోడీ బుధవారం నాడు లండన్‌లో అరెస్టయ్యాడు.రెండు రోజుల క్రితమే నీరవ్ మోడీ అరెస్ట్ కు యూకే ప్రభుత్వం అరెస్ట్ వారంట్ జారీ చేసింది. 

నీరవ్ మోడీని ఇవాళ లండన్ కోర్టులో హాజరుపర్చనున్నారు.పంజాబ్ నేషనల్ బ్యాంకులో 2 బిలియన్ డాలర్ల స్కాంలో నీరవ్ మోడీ ప్రధాన నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

వెస్ట్ మినిష్టర్ కోర్టు ఆదేశాలతో నీరవ్ మోడీని అరెస్ట్ చేశారు. ఏడాది క్రితమే నీరవ్ మోడీని అప్పగించాలని బ్రిటన్‌ను భారత్ కోరింది.ఈ విషయమై వెస్ట్ మినిస్టర్ కోర్టు విచారణ చేసింది. రెండు రోజుల క్రితం నీరవ్ మోడీని అరెస్ట్ చేయాలని  కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కొద్దిసేపట్లో వెస్ట్ మినిస్టర్ కోర్టులో నీరవ్ మోడీని హాజరుపర్చనున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంకులో 11 వేల 400 కోట్ల స్కాంలో  మోడీ ప్రధాన నిందితుడుగా ఉన్నట్టుగా భారత్ యూకేకు తెలిపింది.ఈ స్కాం బయటపడడానికి కొన్ని రోజుల ముందే నీరవ్ మోడీ యూకేకు పారిపోయాడు.