ఢిల్లీలో Omicron పంజా.. తాజాగా మరో పది కేసులు, మొత్తంగా 20కి చేరుకున్న పాజిటివ్ లు...
దేశ రాజధాని ఢిల్లీలో తాజాగా పది కొత్త ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి, దీంతో దేశ రాజధానిలో మొత్తం ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 20కి చేరుకుంది. ఈ 20 మందిలో మొత్తం 10 మంది డిశ్చార్జ్ అయ్యారని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు.
న్యూఢిల్లీ : ఢిల్లీలో పది కొత్త Omicron variant కేసులు నమోదయ్యాయి, దీంతో దేశ రాజధానిలో మొత్తం ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 20కి చేరుకుంది. ఈ 20 మందిలో మొత్తం 10 మంది డిశ్చార్జ్ అయ్యారని ఢిల్లీ ఆరోగ్య మంత్రి Satyender Jain తెలిపారు.
గురువారంనాడు ఢిల్లీలో తాజాగా 85 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి, గడిచిన నాలుగు నెలల్లో ఇది అత్యధికం, దీనితో పాజిటివిటీ రేటు 0.15 శాతానికి పెరిగింది. ఇక ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన డేటా ప్రకారం, గత 24 గంటల్లో భారతదేశంలో 7,447 కొత్త COVID-19 కేసులు, 391 మరణాలు నమోదయ్యాయి, దీంతో మొత్తం కేస్ లోడ్ 3,47,26,049కి, మొత్తం మరణాల సంఖ్య 4,76,869కి చేరుకుంది.
కాగా డిసెంబర్ 17, 2021 శుక్రవారం అంటే ఈ రోజు దేశంలో 7,886 రికవరీలు నమోదయ్యాయి. యాక్టివ్ కోవిడ్-19 కాసేలోడ్‌లో 24 గంటల వ్యవధిలో 830 కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇక యాక్టివ్ కేసులు 86,415గా ఉన్నాయి. కొత్తగా 391 మరణాలు నమోదయ్యాయి. వీటిలో కేరళలో 320, మహారాష్ట్రలో 19 మరణాలు ఉన్నాయి..
కేరళలో నమోదైన 320 మరణాలలో, 36 గత కొన్ని రోజులుగా నమోదయ్యాయి. కేంద్రం సూచించిన కొత్త మార్గదర్శకాలు, సుప్రీంకోర్టు ఆదేశాల ఆధారంగా అప్పీళ్లను స్వీకరించిన తర్వాత 284 కొత్త కోవిడ్-19 మరణాలు గుర్తించబడ్డాయని గురువారం. కేరళ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సమాచారం.
తెలంగాణలో 9కి చేరిన ఒమిక్రాన్ కేసులు
మహారాష్ట్రలో 1,41,317, కేరళలో 43,946, కర్ణాటకలో 38,279, తమిళనాడులో 36,656, ఢిల్లీలో 25,100, ఉత్తరప్రదేశ్ లో 22,915, పశ్చిమ బెంగాల్ లో 19,645 సహా దేశంలో ఇప్పటివరకు మొత్తం 4,76,869 మరణాలు నమోదయ్యాయి. 70 శాతానికి పైగా మరణాలు కోమోర్బిడిటీల కారణంగానే సంభవించాయని మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది. "మా గణాంకాలు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌తో సమన్వయం చేయబడుతున్నాయి" అని మంత్రిత్వ శాఖ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది, రాష్ట్రాల వారీగా గణాంకాల పంపిణీ మరింత ధృవీకరణ, సయోధ్యకు లోబడి ఉంటుంది.
దక్షిణాఫ్రికాలో గత నెలలో వెలుగు చూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పంజా విసురుతోంది. పలు దేశాల్లో ప్రమాదకర స్థాయిలో విజృంభిస్తోంది. భారత్ లోనూ ఈ రకం కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కొత్త వేరియంట్ కేసుల సంఖ్య సెంచరీకి చేరువైంది. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్త మవుతోంది. కొత్తగా ఒక్కరోజే కర్నాటకలో 5, తెలంగాణలో 4 కొత్త ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి.
ఈ కేసులతో కలిపి దేశంలో మొత్తం ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 100కు చేరువలో ఉన్నాయి. ఇప్పటివరకు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు అధికంగా మహారాష్ట్రలో 32 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా కర్నాటకలో 8, తెలంగాణలో 9, ఢిల్లీలో 20, మహారాష్ట్రలో 32, రాజస్తాన్ లో 17, కేరళలో 5, గుజరాత్ లో 5, ఏపీ, తమిళనాడు, బెంగాల్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఒక్కొక్క ఒమిక్రాన్ కేసు నమోదైంది.