తెలంగాణలో 8కి చేరిన Omicron కేసులు

ఇప్పటి వరకు  సామాజిక వ్యాప్తి జరగలేదని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన ఏడుగురితోపాటు హన్మకొండకు చెందిన మహిళకు ఒమిక్రాన్ సోకినట్లు ఆయన చెప్పారు. చెక్ రిపబ్లిక్, సూడాన్, యూకే, కెన్యా, సోమాలియా దేశాలనుంచి వచ్చిన వారికి  ఒమిక్రాన్ సోకింది అన్నారు.  హన్మకొండకు చెందిన మహిళకు ఎనిమిది రోజుల తర్వాత కోవిడ్ పాజిటివ్ ఆ తరువాత ఒమిక్రాన్ నిర్ధారణ అయిందని ఆయన వివరించారు.

9 Omicron cases in Telangana

హైదరాబాద్ :  Telanganaలో Omicron cases సంఖ్య తొమ్మిదికి చేరింది. ఈ మేరకు తెలంగాణ ప్రజా ఆరోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కోఠిలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శంషాబాద్ విమానాశ్రయంలో సేకరించిన నమూనాల్లో 9మందికి ఒమిక్రాన్ నిర్ధారణ అయిందని.. వీరిలో 8 మంది రాష్ట్రంలో ప్రవేశించారు అని చెప్పారు. మరొక వ్యక్తి West Bengal కు చెందిన వారు అన్నారు. ఆయన రాష్ట్రంలోకి ప్రవేశించలేదు అని డీహెచ్ వివరించారు. కొత్తగా హన్మకొండ, చార్మినార్ లలో ఒమి క్రాన్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. 

ఇప్పటి వరకు  సామాజిక వ్యాప్తి జరగలేదని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన ఏడుగురితోపాటు హన్మకొండకు చెందిన మహిళకు ఒమిక్రాన్ సోకినట్లు ఆయన చెప్పారు. చెక్ రిపబ్లిక్, సూడాన్, యూకే, కెన్యా, సోమాలియా దేశాలనుంచి వచ్చిన వారికి  ఒమిక్రాన్ సోకింది అన్నారు.  హన్మకొండకు చెందిన మహిళకు ఎనిమిది రోజుల తర్వాత కోవిడ్ పాజిటివ్ ఆ తరువాత ఒమిక్రాన్ నిర్ధారణ అయిందని ఆయన వివరించారు.

‘ఒమిక్రాన్ వేరియంట్ తో భయాందోళనలు అవసరం లేదు. 90 దేశాల్లో ఒమిక్రాన్ వ్యాప్తి చెందింది. ఇప్పటి వరకు యూకేలో ఒక్కటి తప్ప ఎక్కడా మరణాలు నమోదు కాలేదు. 95 శాతం కంటే ఎక్కువగా ఒమిక్రాన్ సోకిన వారిలో ఎలాంటి లక్షణాలు ఉండటం లేదు. ఈ వేరియంట్ తో ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదు’ అని చెప్పారు.

కాగా, శుక్రవారం నాటికి తెలంగాణాలో 9 ఒమిక్రాన్ కేసులు రిపోర్ట్ అయ్యాయి. ఒమిక్రాన్ తో ప్రమాదం లేకున్నా జాగ్రత్తగా ఉండాలని శ్రీనివాసరావు సూచించారు. రెండు డోసులు వ్యాక్సిన్  తీసుకున్న వారికి కూడా ఒమిక్రాన్ పాజిటివ్ గా వస్తుందని.. కాబట్టి వ్యాక్సిన్ వేసుకున్నామని నిర్లక్షం తగదని హెచ్చరించారు. తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం చేయాలని సూచించారు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాస్క్ పెట్టుకోవాలని దీనివల్ల ఒమిక్రాన్ వ్యాప్తిని అరికట్టొచ్చని తెలిపారు. 

telangana Omicron updates: తెలంగాణలో ఒమిక్రాన్ అలజడి.. కొత్తగా మరో నాలుగు కేసులు, ఏడుకి చేరిన సంఖ్య

ఇదిలా ఉండగా, దక్షిణాఫ్రికాలో పుట్టిన  కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోన్న సంగతి తెలిసిందే. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ మహమ్మారి భారత్‌లోకి ప్రవేశించింది. తెలంగాణలోనూ ఈ వేరియంట్ విస్తరిస్తోంది. తాజాగా గురువారం మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి తెలంగాణలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఏడుకు చేరుకున్నాయి. వీటితో కలిపి దేశంలో ఇప్పటి వరకు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 87కి చేరుకుంది. ఈ నేపథ్యంలో దేశంలో కొవిడ్‌-19 పరిస్థితులపై కేంద్ర హాంశాఖ గురువారం సమీక్ష నిర్వహించింది. ముఖ్యంగా కొవిడ్‌ కట్టడికి కేంద్ర పాలిత ప్రాంతాలు సిద్ధంగా ఉండాలని సూచించింది.  

నగరంలోని Tolichowki పారామౌంట్ కాలనీలో బుధవారం రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ, వైద్యారోగ్య శాఖ ఆ ప్రాంతంలో కరోనా ఆంక్షలు విధించాయి. ఒమిక్రాన్ కేసులు బయటపడిన వారి నివాసాలకు సమీపంలోని 25ఇళ్ల పరిధిలో కంటైన్ మెంట్ జోన్ ఏర్పాటు చేశారు. ఈ నెల 12న కెన్యా, సోమాలియా దేశాల నుంచి నగరానికి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ నిర్థారణ అయిన విషయం తెలిసిందే. వారిని గచ్చిబౌలిలోని టిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios