క్రిమినల్ కేసులు: పుట్ట మధు సహా మరో ముగ్గురు టిడీపీ ఎమ్మెల్యేలపైనా...

1 TRS and 3 TDP MLAs face criminal charges, including kidnapping
Highlights

ఇరు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులున్నట్లు ఓ సర్వే బైటపెట్టింది. దేశ వ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై సర్వే నిర్వహించిన అసోసియేషన్ ఆప్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడిఆర్) మరియు నేషనల్ ఎలక్షన్ వాచ్(ఎన్ఈడబ్యూ) ఈ విషయాన్ని బైటపెట్టింది. తెలుగు ఎమ్మెల్యేలపై సీరియస్ క్రిమినల్ కేసులతో పాటు కిడ్నాప్ కేసులున్నట్లు ఈ సర్వే వెల్లడించింది. 
 

ఇరు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులున్నట్లు ఓ సర్వే బైటపెట్టింది. దేశ వ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై సర్వే నిర్వహించిన అసోసియేషన్ ఆప్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడిఆర్) మరియు నేషనల్ ఎలక్షన్ వాచ్(ఎన్ఈడబ్యూ) ఈ విషయాన్ని బైటపెట్టింది. తెలుగు ఎమ్మెల్యేలపై సీరియస్ క్రిమినల్ కేసులతో పాటు కిడ్నాప్ కేసులున్నట్లు ఈ సర్వే వెల్లడించింది. 

తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పుట్టా మధుపై ఇరు క్రిమినల్ కేసులున్నట్లు వెల్లడయింది. ఇందులో కిడ్నాప్, మారణాయుధాలను కలిగి ఉండటం, బెదిరింపులు, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం వంటి కేసులున్నాయి. పుట్టా మధు మంథని నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇతడిపై గతంలో జిల్లా కలెక్టర్ భూములను కభ్జా చేసినట్లు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. 

ఇక మరో తెలుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లో అధికార టిడిపి పార్టీ ఎమ్మెల్యేలు ముగ్గురిపై క్రిమినల్ కేసులున్నట్లు ఈ సర్వే వెల్లడించింది. అనంతపురం జిల్లాలో టిడిపి పార్టీ నుండి ధర్మవరం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న గోనుగుంట్ల సూర్యనారాయణపై ఐపిసి 506 సెక్షన్ కింద క్రిమినల్ కేసుతో పాటు కిడ్నాఫ్, దొంగతనం కేసు నమోదై ఉన్నట్లు వెల్లడించింది. ఇలా ఈయనపై 10 కేసులున్నట్లు ఈ సర్వే తెలిపింది. ఇక గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర కుమార్ పై కిడ్నాప్, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యు తోట త్రిమూర్తులుపై కూడా కిడ్నాప్ కేసు నమోదై ఉన్నట్లు ఈ సర్వే బైటపెట్టింది. 

 అసోసియేషన్ ఆప్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడిఆర్) మరియు నేషనల్ ఎలక్షన్ వాచ్(ఎన్ఈడబ్యూ) సంస్థలు సంయుక్తంగా ఈ సర్వే నిర్వహించాయి. దేశంలోని మొత్తం  4,856 మంది ఎంపీలు, ఎమ్మెల్యేల పై సర్వే నిర్వహించారు. ఇందులో 21 శాతం మందిపై అంటే 1,024 మంది నాయకులపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఈ సంస్థల సర్వేలో వెల్లడయింది. ఇందులో 64 మందిపై సీరియస్ కిడ్నాపింగ్ కేసులు ఉన్నట్లు బైటపడింది.

ఇక పార్టీల పరంగా చూస్తే బిజెపి నాయకులే కేసుల్లో ముందున్నారు. కాంగ్రెస్ పార్టీ కంటే 16 మంది క్రిమినల్ పోలిటీషన్స్ బిజెపిలో ఎక్కువగా ఉన్నట్లు సర్వే ఫలితాలు బైటపెట్టాయి. నేషనల్ ఎలక్షన్ కమీషన్ కు 770 మంది సిట్టింగ్ ఎంపీలు, 4086 మంది ఎమ్మెల్యేలు సమర్పించిన అఫిడవిట్ ను పరిశీలించి ఈ వివరాలు సేకరించినట్లు  ఏడిఆర్, ఎన్ఈడబ్యూ అధికారి అనిల్ వర్మ తెలిపారు. ఇందులో 21 శాతం మంది పై క్రిమినల్ కేసులున్నట్లు గుర్తించినట్లు ఆయన తెలిపారు. 


 

loader