దేశంలో కరోనా వైరస్ రోజు రోజుకీ వ్యాప్తి చెందుతోంది. దీంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలకు అందుబాటులోకి శానిటైజర్లు, మాస్క్ లు తీసుకువచ్చారు.  వైరస్ వ్యాపించిన మొదటి వారంలో మాస్క్ లు, శానిటైజర్లు అందుబాటులో లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో.. కేరళ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. కేరళ ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఒక్కరోజునే లక్ష శానిటైజర్స్ బాటిల్స్‌ను ఉత్పత్తి చేశారు.

Also Read కరెన్సీ నోట్లతో కరోనా... ఇదో కొత్త రకం టెన్షన్...

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో శానిటైజర్స్‌కు విపరీతంగా డిమాండ్ పెరిగిందని, దానిని దృష్టిలో ఉంచుకొని ఇంతటి భారీ సంఖ్యలో ఉత్పత్తి చేశామని పరిశ్రమల మంత్రి జయరాజన్ తెలిపారు. దాదాపు 200 మంది ఉద్యోగులు 3 షిప్టులో పనిచేసి లక్ష శానిటైజర్ బాటిల్స్‌ను ఉత్పత్తి చేశారు. 

ఇతర మందుల ఉత్పత్తిని పూర్తిగా నిలిపేసి, కేవలం శానిటైజర్స్ ఉత్పత్తి పైనే దృష్టి సారించాం. ఒకానొక దశలో వీటికి అవసరమైన ముడిసరుకు కొరత ఏర్పడింది. డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రైవేట్ సంస్థలు ముడి సరుకు ధరలను విపరీతంగా పెంచేశాయి. ఎక్సైజ్ శాఖ ముందుకొచ్చి వాటికి అవసరమైన ముడి సరుకును అందించింది.’’ అని మంత్రి జయరాజన్ తెలిపారు.