బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ , అలనాటి అందాల తార రేఖ తో కలిసి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో కలిసి నటించారు. వారిద్దరూ ప్రేమించుకున్నారంటూ, వారి మధ్య ఏదో నడిచిందంటూ ఒకప్పుడు వార్తలు వచ్చాయి. అమితాబ్ కి జయాబచ్చన్ తో ప్రేమ వివాహం జరిగినా.. ఈ రూమర్స్ కి పులిస్టాప్ పడలేదు. రేఖ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోవడానికి కారణం.. బిగ్ బీతో ప్రేమే అంటూ ఇప్పటికీ రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి.

ఇక వీరిద్దరూ ఏక్కడైనా పొరపాటున ఒకే ప్లేస్ లో కనపడితేచాలు.. నెక్ట్స్ మినిట్ వార్తల్లో హెడ్ లైన్స్ అయిపోతారు. అందుకే.. అలాంటి వార్తలకు దూరంగా ఉండాలని రేఖ ప్రయత్నిస్తుంటారు. విచిత్రం ఏమిటంటే.. దూరంగా ఉండాలని ఆమె చేసిన ప్రయత్నాలు కూడా వార్తలై కూర్చుకుంటున్నాయి. తాజాగా అమితాబ్ బచ్చన్ ఫోటో పక్కన ఆమె ఫోటో దిగాల్సిన పరిస్థితి రావడంతో.. ఆమె చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

Also Read ANR Awards: శ్రీదేవి, రేఖలకు అక్కినేని జాతీయ అవార్డులు!.

ఇంతకీ మ్యాటరేంటంటే.... ప్రముఖ సెలబ్రెటీ ఫోటో గ్రాఫర్ డబూ రత్నానీ ప్రతి సంవత్సరం తన క్యాలెండర్ కోసం సినీ ప్రముఖులను ఫోటోలు తీస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది క్యాలెండర్ లాంఛ్ కార్యక్రమానికి రేఖ వచ్చారు.

 

ఆ క్యాలెండర్ లోని సినీ ప్రముఖుల ఫోటోలను గోడకు ఏర్పాటు చేయగా... వాటి వద్ద నిలబడి రేఖ ఫోటోలకు పోజులు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఆమె బిగ్ బి అమితాబ్ ఫోటో వద్దకు వెళ్లారు. వెంటనే అమితాబ్ ఫోటో చూసి... అమ్మో ఇది చాలా డేంజర్ ప్రదేశం అంటూ.. పక్కకి వచ్చేసి.. వేరే సెలబ్రెటీల పక్కన నిలబడి ఫోటోలు దిగారు. కాగా... ఆమె వేసిన పంచ్ కి అక్కడ ఉన్నవారంతా పగలబడి నవ్వేశారు. 

ఎక్కడ అమితాబ్ పక్కన ఫోటో దిగితే... వార్తల్లో ఏం రాసేస్తారో అని ఆమె అక్కడ దిగకుండా తప్పించుకున్నారు. కాగా... దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అయితే... గతేడాది క్యాలెండర్ లాంఛ్ సమయంలో కూడా ఆమె ఇదే విధంగా రెస్పాండ్ అయ్యారు. వెంటనే అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఇప్పుడేమో డేంజర్ అంటూ ఆ ప్లేస్ నుంచి వచ్చేశారు. ఏది ఏమైనా ఒకప్పుడు వీరిద్దరూ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి అభిమానులు ఫిదా అయ్యారు. వీరిద్దరూ కలిసి సినిమా చేస్తే చాలు హిట్ అయిపోయేది. వీరి జంటకు ఎంత మంది అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే.. వారి వయసు ఏడు పదుల్లోకి వచ్చినా.. రూమర్స్ మాత్రం ఆగడం లేదు.