సినీ పరిశ్రమకి అక్కినేని నాగేశ్వరావు అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏడాది పరిశ్రమలోని సినీ ప్రముఖులను గుర్తించి ఏఎన్నార్ అవార్డును అందించడం జరుగుతోంది. 2006వ సంవత్సరం నుండి ఈ అవార్డులను ప్రకటించడం జరుగుతోంది. తొలిసారిగా ఈ అవార్డును ప్రముఖ బాలీవుడ్ సూపర్స్టార్ దేవానంద్ అందుకున్నారు. ఇక ఇటీవల 2017లో టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి గారిని ఈ అవార్డు వరించింది. 

ఇక 2018-19 సంవత్సరానికి గాను దివంగత దిగ్గజ నటి శ్రీదేవి మరియు, బాలీవుడ్ సీనియర్ నటి రేఖ లకు ప్రధానం చేయడానికి కమిటీ సభ్యులు నిర్ణయించారు. ఈనెల 17వ తేదీన హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ ఏడు ఎకరాల ఆవరణలో పలువురు చిత్ర రంగ ప్రముఖుల సమక్షంలో వారికి ఈ అవార్డులను ప్రధానం చేయడం జరుగుతుందని నాగార్జున తెలిపారు.

స్విమ్మింగ్ పూల్ లో శ్రియా.. అందాలతో హీటెక్కిస్తోంది!

17వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభం అయ్యే ఈ వేడుకకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారు ప్రత్యేక అతిథిగా రానుండగా, విశిష్ట అతిథిగా కళాబంధు టి సుబ్బిరామిరెడ్డి గారు రాబోతుననట్లు నాగార్జున ప్రకటించారు.

ఇక అన్నపూర్ణ మీడియా ఫిలిం స్కూల్ నుండి ఇప్పటికే పలువురు విద్యార్థులకు పలు సినీ క్రాప్స్ లో శిక్షణ ఇవ్వడం జరుగుతోందని, రాబోయే ఏడాదిలో జవహర్ లాల్ యూనివర్సిటీ తరపు నుండి వందలాది విద్యార్థులు తమ శిక్షణ తరువాత పట్టాలను అందుకుంటారని, అలానే వారు రాబోయే తరాలకు మార్గదర్శకులుగా నిలవాలని కోరుకుంటున్నట్లు నాగార్జున తెలిపారు. ఇక ఈ ప్రెస్ మీట్ లో నాగార్జున గారితో పాటు సుబ్బిరామిరెడ్డి గారు కూడా పాల్గొనడం జరిగింది.