కంటే సంస్కారవంతులనే కనండి.. లేకుండే కనకండి

"Produce Sanskari Kids Or Stay Infertile," BJP Lawmaker's Tip For Women
Highlights

బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో బీజేపీ నేతలు ముందు వరసలో ఉంటారు. ఒకరి తర్వాత మరొకరు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. వివాదంలో చిక్కుకుంటున్నారు. గతంలో విరాట్ కోహ్లి దేశభక్తిని ప్రశ్నించడంతోపాటు బాయ్‌ఫ్రెండ్స్ వద్దే వద్దని యువతులకు చెప్పిన పన్నాలాల్ అనే బీజేపీ నేత తాజాగా అలాంటిదే మరో పిచ్చి కామెంట్ చేశారు. కంటే సంస్కారవంతులైన పిల్లల్నే కనండి.. లేదంటే కనడం మానేయండి అంటూ మహిళలకు సూచించారు.

మధ్యప్రదేశ్‌లోని తన సొంత నియోజకవర్గమైన గుణలో జరిగిన ఓ పబ్లిక్ ర్యాలీలో పన్నాలాల్ శక్యా ఈ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీని ఉద్దేశించి పన్నాలాల్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘కాంగ్రెస్ పేదరికాన్ని పారదోలండి అన్న నినాదంతో వచ్చి పేదలనే లేకుండా చేసేసింది. ఇలాంటి నేతలను కనే మహిళలు కొందరున్నారు. మహిళలు సంస్కారవంతులను కంటే కనండి.. లేదంటే అసలు పిల్లల్నే కనొద్దు’ అంటూ పన్నాలాల్ చేసిన వ్యాఖ్యలు చూసి అక్కడున్న వాళ్లంతా షాక్ తిన్నారు.

రామునికి జన్మనిచ్చిన కౌసల్య మహిళలకు రోల్ మోడల్ అని ఆయన అన్నారు. గతంలోనూ ఇలాగే ఓ ప్రభుత్వ కాలేజీలో మాట్లాడుతూ.. యువతులు బాయ్‌ఫ్రెండ్స్‌ను చేసుకోవడం మానేస్తే వాళ్లపై వేధింపులు తగ్గిపోతాయి అని అనడం విశేషం. ఈయనే విరాట్ కోహ్లి ఇటలీలో పెళ్లి చేసుకున్న సమయంలో అతని దేశభక్తిని ప్రశ్నించారు. విరాట్ ఇక్కడ డబ్బు సంపాదించి.. ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి ప్లేసే లేనట్లు ఇటలీ వెళ్లాడని విమర్శించారు.

loader