ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్న ఓ మహిళకు అర్థరాత్రి ఓ రాక్షసుడు నరకం చూపించాడు. ఆమె ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. కిటికీల్లో నుంచి కండోమ్ ప్యాకెట్లు లోపలికి విసిరేశాడు. అదేపనిగా తలుపు కొట్టడం, కాలింగ్ బెల్ కొట్టడం లాంటివి చేసి.. వారికి చుక్కలు చూపించాడు.ఈ దారుణ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... బెంగళూరుకు చెందిన ఓ యువతి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఆమె ఒంటరిగా ఇంట్లో జీవిస్తోంది. కాగా... ఆమె ఒంటరిగా ఉంటుదన్న విషయం తెలుసుకున్న ఓ కలియుగ రాక్షసుడు ఆమెను భయపెట్టాడు. జనవరి 30న  ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఎవరో అదేపనిగా తలుపు తడుతున్న శబ్ధాలు వినిపించాయి. రానురానూ ఈ శబ్ధాలు మరింత ఎక్కువయ్యాయి. దీంతో ఉదయం 2 గంటల సమయంలో డయల్‌ 100కు ఫోన్‌ చేసింది.

ఇంతలో దుండగుడు ప్రధాన ద్వారం దగ్గర ఉన్న కిటికీను తెరిచి అందులోనుంచి చేయి పోనిచ్చి తలుపు గొళ్లెం తెరిచేందుకు ప్రయత్నించాడు. ఇందులో భాగంగా అక్కడికి దగ్గర ఉన్న స్విచ్‌బోర్డుపై చేయి పడగా హాల్‌లోని లైట్లు వెలిగాయి. అంతే.. అతను భయంకరంగా మేడమ్‌, మేడమ్‌ అని అరుస్తూ లైట్లు ఆన్‌ చేస్తూ, ఆఫ్‌ చేస్తూ ఆమెను మరింత భయపెట్టేందుకు ప్రయత్నించాడు. మరోవైపు తలుపులపై బాదుతూ, కాలింగ్‌ బెల్‌ కొట్టాడు. 

Also Read థాయ్ లాండ్ జాతీయరాలిపై రేప్: ఇద్దరి అరెస్టు.

ఇంతలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో వారిని గమనించిన దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. కాగా పోలీసులు ఆ రాత్రి తనకు రక్షణ కల్పిస్తారని భావించిన యువతికి నిరాశే ఎదురైంది. కేవలం ఒక ఫోన్‌నెంబర్‌ ఇచ్చి మళ్లీ ఏదైనా జరిగితే కాల్‌ చేయండని చెప్పారు. ‘అంటే మళ్లీ జరిగేవరకు నేను ఎదురు చూడాలా?’ అని అంటున్న మాటలను కూడా పట్టించుకోకుండా అక్కడ నుంచి నిష్క్రమించారు. అయితే పోలీసులు కనీసం ఇంటి చుట్టుపక్కల కూడా వెతక్కుండానే వెళ్లిపోయారు’’ అని ఆమె వాపోయింది.

తనకు జరిగిన దానిని పోలీసులు పెద్దగా పట్టించుకోకపోయినా.. తనను అంతలా భయపెట్టిన వ్యక్తిని మాత్రం వదలకూడదని ఆమె అనుకుంది. వెంటనే ఈ విషయం తమ అపార్ట్ మెంట్ పెద్దలకు తెలియజేసి.. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితుడిని కనిపెట్టింది. అతను ఎవరో తనకు తెలియదని పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేసింది.  అయితే.. సదరు నిందితుడు గతంలో కూడా కొందరిని ఇలానే భయపెట్టినట్లు తెలుస్తోంది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.