నేను కరోనా రోగినని చెబుతూ.. ఇళ్ల ముందు కరెన్సీ నోట్లు పడేసి..

సహస్ర పట్టణంలో గత నాలుగు రోజులుగా ఇళ్ల గుమ్మాల ముందు రూ. 20, రూ. 50, రూ. 100 నోట్లు దర్శనమిస్తున్నాయి. వాటితోపాటు ఓ చీటీ కూడా ఉంటోంది. అందులో తాను కరోనాతో వచ్చానని, తాను పెట్టిన ఈ నోట్లను స్వీకరించాలని, లేదంటే ప్రతి ఒక్కరినీ వేధిస్తానని అందులో రాసి ఉంది.
‘I have come with corona’: Currency notes found outside houses in Bihar town
దేశంలో ఓవైపు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఆ వైరస్ ని దేశం నుంచి పారద్రోలి.. ప్రజలను ఎలా కాపాడాలా అని ప్రభుత్వాలు, డాక్టర్లు నానా తంటాలు పడుతుంటే.. కొందరు ఆకతాయిలు మాత్రం చిత్ర విచిత్ర వేషాలు వేస్తున్నారు. వైరస్ పేరు చెప్పి ప్రజలను మరింతగా భయపెడుతున్నారు.

బీహార్‌లో పొద్దున్నే ఇళ్ల ముందు ప్రత్యక్షమవుతున్న కరెన్సీ నోట్లు స్థానికుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. సహస్ర పట్టణంలో గత నాలుగు రోజులుగా ఇళ్ల గుమ్మాల ముందు రూ. 20, రూ. 50, రూ. 100 నోట్లు దర్శనమిస్తున్నాయి. వాటితోపాటు ఓ చీటీ కూడా ఉంటోంది. అందులో తాను కరోనాతో వచ్చానని, తాను పెట్టిన ఈ నోట్లను స్వీకరించాలని, లేదంటే ప్రతి ఒక్కరినీ వేధిస్తానని అందులో రాసి ఉంది.

దీంతో భయపడుతున్న స్థానికులు విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటి వరకు ముగ్గురి ఇంటి ముందు ఇలా కరెన్సీ నోట్లు లభించాయని, చీటీలోని చేతిరాత ప్రకారం ఈ పనికి పాల్పడుతున్నది ఒక్కరేనని అనుమానిస్తున్నారు. జనాన్ని ఆటపట్టించేందుకే అతడు ఇలా చేస్తుండవచ్చని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios