Asianet News TeluguAsianet News Telugu

'నేను మీ కోసం పోరాడుతున్నాను. మీరు నాతో కలిసి పోరాడండి'.. ఉద్యోగులకు బైజూ సీఈఓ ఈమెయిల్.. వైరల్..

బైజూస్ సంస్థ తమ ఉద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం గడువుకంటే ఒక్కరోజు ముందే బకాయిలు చెల్లించింది. ఈ క్రమంలో బైజూ వ్యవస్థాపకుడు ఓ లేఖ కూడా రాశారు. 

'I am fighting for you. You fight with me'.. Baiju CEO's email to employees, Viral - bsb
Author
First Published Feb 6, 2024, 1:09 PM IST

విద్యాసేవల సంస్థ బైజూస్ గత కొంతకాలంగా తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దెబ్బ మీద దెబ్బలా ఈ సంస్థకు అనేక షాక్ లు తగులుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో జీతాల విషయంలో జైజూస్ సీఈవో, సంస్థ వ్యవస్థాపకుడు రవీంద్రన్ బైజు ఉద్యోగులకు రాసిన లేఖ హృద్యంగా ఉంది. బైజూ సిబ్బందికి జనవరి జీతాలను విడుదల చేశారు. ఈ క్రమంలోనే రవీంద్రన్ బైజూ సంస్థ ఉద్యోగులను ఉద్దేశించి ఓ లేఖ రాశారు. అందులో సంస్థ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఉద్యోగులు చేసిన సామూహిక త్యాగాలను, వారిచ్చిన తిరుగులేని మద్దతును గుర్తించారు. 

జనవరి నెల జీతాలు ఇవ్వడం విషయాన్ని.. దీనికోసం వారు చూపిస్తున్న సహనానికి కృతజ్ఞతలు తెలిపారు. "మీకు జీతాలు ఏర్పాటు చేయడం కోసం నెలలుగా విపరీతంగా పోరాడుతున్నాను. ఈసారి, న్యాయంగా మీకు దక్కాల్సింది దక్కేలా మరింత పెద్ద పోరాటం చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ త్యాగాలు చేశారు, ప్రతి ఒక్కరూ ఎన్నడూ చూడని నిర్ణయాలతో పోరాడారు. ప్రతి ఒక్కరూ ఈ యుద్ధంలో కొంచెం అలసిపోయారు, కానీ ఎవర్నీ వదులుకోవడానికి మేము ఇష్టపడలేదు" అని బైజు ఆదివారం (ఫిబ్రవరి 4) ఉద్యోగులకు రాసిన లేఖలో తెలిపారు.

‘ఫైటర్’ సినిమా ముద్దు సీన్లపై భారత వైమానిక శాఖ సీరియస్.. టీంకు లీగల్ నోటీసులు..

నివేదికల ప్రకారం, కంపెనీ తన ప్రస్తుత ఉద్యోగులకు చెల్లించాల్సిన అన్ని బకాయి చెల్లింపులను గతంలో ప్రకటించిన గడువు కంటే ఒక రోజు ముందే సెటిల్ చేసింది. ఈ సందర్భంగా లేఖ రాస్తూ.. "నా సామర్థ్యంపై మీ నమ్మకం కంటే నాకు ఏదీ ముఖ్యం కాదు. నేను మీ కోసం పోరాడుతున్నాను. మీరు నాతో పాటు పోరాడండి. ఈ క్రమంలో ఎదురయ్యే ప్రతీ తుఫానును ఎదుర్కొనేందుకు నాకు సహాయపడిన పవిత్ర సంబంధం ఇదే" అని బైజు లేఖలో పేర్కొన్నారు.

శుక్రవారం ఇమెయిల్ ద్వారా ఉద్యోగులకు పంపిన కమ్యూనికేషన్‌లో, జనవరి జీతాల చెల్లింపులలో జాప్యానికి యాజమాన్యమే కారణమని పేర్కొంది. ఇది సంస్థలో నిర్దిష్ట పెట్టుబడిదారులతో "కృత్రిమంగా ప్రేరేపించబడిన సంక్షోభం" అని పేర్కొన్నారు. "కొందరు పెట్టుబడిదారులు ఈ సంక్షోభాన్ని చూపి, బైజూస్ గ్రూప్ సీఈఓగా వ్యవస్థాపకుడిని వైదొలిగేలా చేయాలని కుట్ర చేయడానికి, డిమాండ్ చేయడానికి ఇది ఒక అవకాశంగా భావించారు. ఈ సమయంలో మాకు మద్దతు ఇవ్వాల్సిన కొంతమంది పెట్టుబడిదారుల నుండి ఇలాంటి చర్యలు చూసి బాధపడ్డాం” అని నోట్‌లో పేర్కొన్నారు.

ఉద్యోగులకు రాసిన లేఖలో, కంపెనీ వీటన్నింటినీ దాటుకుని రావడానికి.. అనుకున్న మైలురాయిని చేరుకోవడానికి పావు వంతు కంటే తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉందని, కార్యాచరణ లాభదాయకతను సాధించే అంచున ఉందని బైజు తెలియజేశారు. "ఇంకా పరిష్కరించుకోవాల్సిన పాత బాధ్యతలు కొన్ని ఉన్నాయి అని పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios