న్యూఢిల్లీ:  పీఓకే‌పై భారత్‌కు ప్రత్యేక వ్యూహం ఉందని కేంద్ర మంత్రి వీకే సింగ్ చెప్పారు.గురువారం నాడు వీకే సింగ్  మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. పీఓకేలో చర్యలకు సైన్యం ఎల్లప్పుడూ సిద్దంగానే  ఉందన్నారు.కానీ కేంద్రం ఆదేశాల కోసం సైన్యం ఎదురు చూస్తోందని ఆయన ప్రకటించారు. పీఓకేపై  తమకు ప్రత్యేక వ్యూహం ఉందన్నారు.అయితే ఈ వ్యూహన్ని తాము బహిరంగంగా వ్యక్తం చేయలేమని ఆయన స్పష్టం చేశారు.

పీఓకేలో ఏం  చేయాలో నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. కేంద్రం ఆదేశాల కోసం సైన్యం చూస్తోందని ఆయన గురువారం నాడు ఉదయమే ప్రకటించి పాక్ కు  పరోక్ష హెచ్చరికలు పంపారు.

కాశ్మీర్ లోని పీఓకేను తిరిగి దక్కించుకోవడమే తమ ఎజెండా అని ఆయన ప్రకటించారు. 1994లో పార్లమెంట్ ఈ మేరకు తీర్మానం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ తీర్మానాన్ని పీవీ నరసింహరావు ప్రధానిగా ఉన్న సమయంలో  ఆమోదం తెలిపినట్టుగా ఆయన ప్రస్తావించారు.