నిన్నమొన్నటిదాకా అల్లర్లతో రావణాకాష్టంలా మండిన దేశ రాజధాని ఢిల్లీ ఇప్పుడిప్పుడే ఒక రెండు రోజులుగా ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. అక్కడ అల్లర్లు అదుపులోకి వచ్చినప్పటికీ ప్రజల మధ్య రాజకీయ పార్టీలు ఎన్నికల వేళా పెట్టిన చిచ్చి ఇప్పుడప్పుడు ఆరేర్ధిలా మాత్రం కనబడడం లేదు. 

తాజాగా నేటి ఉదయం ఢిల్లీ మెట్రో స్టేషన్లలోనే అత్యంత రద్దీగా ఉండే రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్లో గోలి మారో అనే నినాదాలు కలకలం సృష్టించాయి. ఒక్కసారిగా ఈ నినాదాలతో మెట్రో స్టేషన్ అంతా భీతావాహ వాతావరణం నెలకొంది. 

వివరాల్లోకి వెళితే... ఉదయం 10.30- 11 గంటల మధ్య ప్రాంతంలో తెల్ల టి షర్టులు, కాషాయ పాగాలు ధరించిన కొందరు స్టేషన్లోకి ప్రవేశించి, రైలు ఆగుతుండగా .... దేశ ద్రోహులను కాల్చేయండి అంటూ నినదించారు. "దేశ్ కే  గద్దరొంకో గోలి మారో" అంటూ నినదించారు. 

Also read; అంకిత్ శర్మ హత్య కేసులో నిందితుడు: పరారీలో తాహిర్ హుస్సేన్

వెంటనే అలెర్ట్ అయినా మెట్రో సెక్యూరిటీ సిబ్బంది ఇందుకు సంబంధించిన 6గురిని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. ఒక్కసారిగా ఈ నినాదాలు చేయడంతో మెట్రో స్టేషన్ లోని ప్రయాణీకులంతా భయానికి గురయ్యారు. 

గతంలో ఎన్నికలవేళ కూడా ఈ నినాదాలు బాగా వినిపించాయి. అప్పట్లో ఎన్నికల సంఘం, తాజాగా కోర్టు సైతం ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు నేతలను మందలించింది. 

Also read; ఢిల్లీ అల్లర్లు: బాలిక మిస్సింగ్, ఢిల్లీ ప్రజల కష్టాలు ఇవీ....