లోక్ సభ ఎన్నికల కోలాహలం సోమవారం ఫీక్ కు చేరుకుంది. లోక్ సభ అభ్యర్థుల నామినేషన్ కు చివరి రోజు కావడంతో ప్రముఖ పార్టీల నాయకులంతా ఈరోజే నామినేషన్ వేశారు. ఇలా ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమాలు అట్టహాసంగా సాగాయి. ఇలా భారీ సంఖ్యలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్త భారీ ర్యాలీతో భువనగిరి లోక్ సభ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ నామినేషన్ కూడా అట్టహాసంగా సాగింది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కార్యకర్తలను ఉత్సాహపర్చడానికి కత్తి డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. 

బ్యాండ్ మేళం ఎదురుగా టీఆర్ఎస్ కార్యకర్తలు డ్యాన్స్ చేస్తుండగా కిషోర్ అక్కడికి చేరుకున్నారు. స్వతహాగా డ్యాన్స్ అంటే అమితంగా ఇష్టపడే ఆయన స్టెప్పులేయకుండా వుండలేకపోయారు. ఇలా డ్యాన్స్ చేస్తూ ఓ కార్యకర్త అందించిన కత్తిని అందుకుని దాన్ని లయబద్దంగా తిప్పుతూ డ్యాన్స్ చేశారు. ఇలా నడిరోడ్డుపై ఎమ్మెల్యే కార్యకర్తలతో మమేకమై వారిని ఉత్సాహపర్చారు.

ఇలా ఎమ్మెల్యే కత్తివిన్యాసంతో కూడిన డ్యాన్స్ ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఆ వీడియో నెటిజన్లకు విపరీతంగా నచ్చడంతో వైరల్ గా మరింది. ఆ వీడియోను కింద చూడండి.   

వీడియో

"