న్యూఢిల్లీ: ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదు ఈవీఎంలలోని వీవీప్యాట్లను లెక్కించాలని సుప్రీం కోర్టు ఈసీనీ ఆదేశించింది.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో  వీవీ ప్యాట్లను లెక్కించాలని కోరుతూ 21 రాజకీయ పార్టీలు దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం నాడు సుప్రీంకోర్టు విచారణ జరిపింది.

ప్రస్తుతం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఒక్క ఈవీఎంలోని  వీవీ ప్యాట్లను మాత్రమే లెక్కిస్తున్నారు. అయితే దీనికి బదులుగా కనీసం సగం ఈవీఎంల వీవీ ప్యాట్లను లెక్కించాలని  21 రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి.

అయితే ఈ విషయమై సోమవారం నాడు సీఈసీని సుప్రీంకోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 35 ఈవీఎంల వీవీ ప్యాట్లను లెక్కించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఒక్క ఈవీఎంలోని 4125 వీవీప్యాట్లను లెక్కిస్తున్నారు. కానీ, తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు 20,625 వీవీప్యాట్లను లెక్కించాల్సి ఉంటుంది.