హైదరాబాద్‌: పొత్తు విషయంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలపై ఆర్జేడీ నేత, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ తీవ్రంగా స్పందించారు. ప్రశాంత్ కిశోర్ కు చురకలు అంటించారు. ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలపై నితీశ్ కుమార్ స్పందించాలని ఆయన సవాల్ చేశారు. 

ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలపై నితీశ్ కుమార్ ఎందుకు మౌనం వహిస్తున్నారని తేజస్వి యాదవ్ అడిగారు. నితీష్ కుమార్ బయటికి వచ్చి మాట్లాడాలని అన్నారు. ప్రశాంత్ కిశోర్ తమను కలిసిన విషయం వాస్తవమని ఆయన అన్నారు. లాలూ పుస్తకంలో కూడా ఇది రాసి ఉందని, దీనిపై ప్రశాంత్ కిశోర్ ఏదైనా ట్వీట్ చేసే ముందు నితీశ్‌తో మాట్లాడడం మంచిదని ఆయన అన్నారు.
 
రబ్రీ దేవి వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రశాంత్ కిశోర్ చేసిన తాజా ట్వీట్‌పై ఆర్జేడీ నేత మృత్యుంజయ్ తివారీ కూడా స్పందించారు. ప్రశాంత్ కిశోర్ ఎందుకు ఈ ట్వీట్లు పెడుతున్నారని ఆయన అడిగారు. ప్రస్తుతం ప్రశాంత్ కిశోర్ అడ్డంగా దొరికిపోయారని, అసలు సినిమా ముందుందని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు

రబ్రీదేవి ఆరోపణలకు ప్రశాంత్ కిశోర్ కౌంటర్

ప్రశాంత్ కిశోర్ పై మాజీ సీఎం భార్య సంచలన ఆరోపణలు

ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో 17, ఎపిలో 25 లోకసభ స్థానాలున్నాయి. దేశంలోని 543 లోకసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి