న్యూఢిల్లీ: వచ్చే లోకసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి పోటీ చేసే 11మందిని, గుజరాత్ నుంచి పోటీ చేసే నలుగురిని ప్రకటించింది.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథీ నుంచి, సోనియా గాంధీ రాయ్‌బరేలి నుంచి మళ్లీ పోటీ చేయనున్నారు. తొలి జాబితాలో ప్రియాంక వాద్రా పేరు లేదు. రాయబరేలీ నుంచి సోనియా కాకుండా ప్రియాంక పోటీ చేస్తారని భావించారు. అయితే, సోనియా గాంధీ మళ్లీ పోటీకి దిగుతున్నారు.

కాంగ్రెసు విడుదల చేసిన తొలి జాబితాలో సీనియర్ కాంగ్రెసు నేత సల్మాన్ ఖుర్షీద్ పేరు ఉంది. ఆయన ఫర్రుక్కాబాద్ నుంచి పోటీ చేయనున్నారు. మరో సీనియర్ నేత ఆర్ పిఎన్ సింగ్ కుషీ నగర్ నుంచి పోటీ చేస్తారు. 

తొలి జాబితాలో చోటు చేసుకున్న ఇతర అభ్యర్థులు వీరే...

ఉత్తరప్రదేశ్: ఇమ్రాన్ మసూద్ (షహరాన్ పూర్), జితిన్ ప్రసాద్ (ధౌరహ్రా), అన్ను టాండన్ (ఉన్నావ్), రాజారామ్ పాల్ (అక్బర్పూర్), బ్రిజ్ లాల్ ఖాబ్రీ (జలౌన్), నిర్మల్ ఖత్రి (పైజాబాద్)

గుజరాత్: భరత్ సిన్హ్ సోలంకి (ఆనంద్), రాజు పర్మార్ (అహ్మదాబాద్ వెస్ట్), ప్రశాంత్ పటేల్ (వడొదర), రంజిత్ మోహన్ సిన్హ్ రథ్వా (ఛోటా ఉదయ్ పూర్)