చెన్నై:  నాథూరామ్ గాడ్సేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంఎన్ఎం చీఫ్, సినీ నటుడు కమల్‌హాసన్‌కు  చేదు అనుభవం ఎదురైంది. బుధవారం నాడు ఓ రోడ్‌షో‌లో పాల్గొన్న కమల్‌పై  ఓ వ్యక్తి చెప్పు విసిరాడు. అయితే ఆ చెప్పు కమల్‌కు తగలలేదు. కొందరు బీజేపీ కార్యకర్తలు, హానుమసేన కార్యకర్తలు కూడ చెప్పులు విసిరే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

నాలుగు రోజుల క్రితం ఓ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న కమల్ హాసన్ నాథూరామ్ గాడ్సేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో దుమారాన్ని రేపాయి.  కమల్‌పై బీజేపీ నేతలు విరుచుకుపడ్డారు. కమల్ నాలుక కోయాలని అన్నాడీఎంకెకు చెందిన మంత్రి రాజేంద్ర తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కమల్‌ను ఎన్నికల ప్రచారం చేయకుండా ఐదు రోజుల పాటు నిషేధం విధించాలని బీజేపీ ఈసీని కోరింది. బుధవారం నాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహిస్తున్న కమల్‌పై ఓ వ్యక్తి చెప్పుతో దాడికి దిగాడు.  మరికొందరు కూడ ఇదే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు అడ్డుకొన్నారు. వారిని అరెస్ట్ చేశారు.  

ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధినేత కమల్‌ హాసన్‌కు చేదు అనుభవం ఎదురయ్యింది. ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న కమల్‌ హాసన్‌ మీద చెప్పులు విసిరారు. బుధవారం ఓ రోడ్ షో లో పాల్గొన్న కమల్ హాసన్ మీద ఓ వ్యక్తి చెప్పు విసిరాడు. అయితే, అది కమల్ హాసన్‌కు తగలలేదు. మరికొందరు కూడా కమల్ మీదకు చెప్పులు విసిరే ప్రయత్నం చేయబోగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ దాడిలో పోలీసులు బీజేపీ కార్యకర్తలతో పాటు హనుమ సేన కార్యకర్తలపై కూడా కేసు నమోదు చేశారు.

రెండు రోజుల క్రితం కమల్ హాసన్ స్వతంత్ర భారత దేశంలో మొట్టమొదటి ఉగ్రవాది ఓ హిందూ అని, అతని పేరు నాథూరామ్ గాడ్సే అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా పెను దుమారం రేపాయి. కమల్ హాసన్ మీద చర్యలు తీసుకోవాలంటూ పలు హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. కమల్ హాసన్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు కూడా చేశారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కమల్ హాసన్ మీద చెప్పుల దాడి జరిగింది.