వచ్చే ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. త్వరలో ఎన్నికల నేపథ్యంలో లోక్ సభ అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఒక తొలి జాబితా విడుదల చేయగా.. మిగితా అభ్యర్థుల పై కసర్తు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. లోక్ సభ అభ్యర్థుల విషయంలో రాహుల్ గాంధీ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోతే లోక్‌సభకు పోటీ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఛాన్స్ ఇవ్వకూడదని గట్టిగా డిసైడ్ అయ్యారట. దీంతోపాటు కొత్తవారికి, నిమ్నకులాల వారికి పోటీ చేసేందుకు ఈసారి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. 

ఇక మూడోది... రాజ్యసభ ఎంపీలుగా కొనసాగతోన్న వారికి కూడా ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వకూడదని కోర్ కమిటీ సభ్యులకు తేల్చిచెప్పారు. ఇక, ఎమ్మెల్యేలుగా గెలిచిపోయి, పార్లమెంట్ రాజకీయాలపై కన్నేసిన వారికీ, ఆయా నేతల బంధువులకు కూడా ఈసారి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ టిక్కెట్లు ఇవ్వరాదని అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.