న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ  చీఫ్ రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా ఈవీఎం‌లతో పాటు, ఎన్నికల షెడ్యూల్‌ను కూడ ప్రభావితం  చేశారని  విమర్శలు చేశారు. ఎగ్జిట్ పోల్స్‌ వెలువడడానికి కొన్ని క్షణాల ముందే రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. 

 

ఏడు విడతల ఎన్నికలు ఆదివారం నాడు పూర్తయ్యాయి. తుది విడత పోలింగ్ ముగిసిన వెంటనే రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్‌పోల్స్‌లో ఎన్డీఏకు ఎక్కువ సీట్లు వస్తాయని ప్రకటించాయి. యూపీఏకు తక్కువ సీట్లు వస్తాయని అన్ని సంస్థలు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఎలక్టోరల్ బాండ్‌ , ఈవీఎం‌లతో పాటు ఎన్నికల షెడ్యూల్‌ను కూడ మోడీ ప్రభావితం చేశారని  రాహుల్ విమర్శించారు. నమోటీవీ, మోడీ ఆర్మీని కూడ మోడీ తనకు అనుకూలంగా ఉపయోగించుకొన్నారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు కేదార్‌నాథ్‌లో పూజలు అంటూ మోడీ డ్రామాలు ఆడుతున్నారని రాహుల్ విమర్శలు చేశారు.