న్యూఢిల్లీ:  ఈవీఎంలు, వీవీప్యాట్ స్లిప్పుల మధ్య తేడా వస్తే అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని కోరినట్టుగా కాంగ్రెస్ పార్టీ నేత గులాం నబీ ఆజాద్ చెప్పారు.

మంగళవారం నాడు 21 రాజకీయ పార్టీల ప్రతినిధులు కేంద్ర ఎన్నికల సంఘానికి వినతి పత్రం సమర్పించారు. ఈవీఎంల కంటే వీవీప్యాట్ స్లిప్పులను  లెక్కింపుపై మార్గదరక్శకాలు ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.

ఈవీఎంల కంటే వీవీప్యాట్ స్లిప్పులను  లెక్కింపుపై మార్గదరక్శకాలు ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.  ఈ సందర్భంగా విపక్ష పార్టీల నేతలు మీడియాతో మాట్లాడారు.

ఈవీఎంలు ప్రైవేట్ వాహనాల్లో తరలించినట్టుగా  ప్రచారం జరిగిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నేత ఆజాద్ గుర్తు చేశారు.ఈవీఎంలు, వీవీప్యాట్ స్లిప్పులకు మధ్య తేడా వస్తే.. ఆ అసెంబ్లీ నియోజకవర్గంలోని వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని కోరినట్టుగా ఆయన చెప్పారు. 

స్ట్రాంగ్ రూమ్‌ల భద్రతపై కూడ తమకు అనుమానాలు ఉన్నాయని కూడ  ఆజాద్ చెప్పారు.  ప్రైవేట్ వాహనాల్లో ఈవీఎంలను తరలిస్తున్నట్టుగా ప్రచారం జరిగిన విషయాన్ని.... వీడియోలు బయటకు వచ్చిన విషయాన్ని  ఈసీ దృష్టికి తీసుకొచ్చినట్టుగా ఆయన గుర్తు చేశారు. 

వీవీప్యాట్ స్లిప్పుల లెక్పించడానికి ఈసీకి వచ్చిన ఇబ్బందులు ఏమిటని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని తాము కొంత కాలంగా ఆందోళన చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తమ డిమాండ్ న్యాయమైందని చంద్రబాబునాయుడు చెప్పారు. తమ ఫిర్యాదులను ఈసీ సరిగా పట్టించుకోలేదని బాబు ఆరోపించారు.

సుప్రీంకోర్టులో ఈసీ ఇచ్చిన సమాధానం సంృతప్తికరంగా లేదని కూడ విపక్షాలు ఈసీ తీరుపై మండిపడ్డాయి. ఓట్ల లెక్కింపు పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉందని విపక్షాలు  అభిప్రాయపడ్డాయి.