న్యూఢిల్లీ:  దేశ వ్యాప్తంగా  ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో పోస్టల్ బ్యాలెట్‌లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఆదిక్యంలో కొనసాగుతోంది.  బుధవారం నాడు ఉదయం దేశ వ్యాప్తంగా 542 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో   పోస్టల్ బ్యాలెట్‌లో ఎన్డీయే  అభ్యర్థులు లీడ్‌లో ఉన్నారు.

కౌంటింగ్ ప్రారంభమైన వెంటనే తొలుత పోస్టల్ బ్యాలెట్‌‌లను లెక్కించారు. పోస్టల్ బ్యాలెట్లలో ఎన్డీయే అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. దేశంలోని 542 లోకసభ స్థానాలకు ఏడు విడతల పోలింగ్ జరిగింది. చివరి విడత ఈ నెల 19వ తేదీన జరిగింది. బిజెపి, కాంగ్రెసు పార్టీలతో పాటు వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేశాయి. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం జరుగుతోంది.