రాంపూర్ : రాంపూర్ సమాజ్‌వాదీపార్టీ అభ్యర్థి ఆజంఖాన్ ను ముగాంబో అంటూ వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి, బిజెపి నేత ముఖ్తార్ అబ్బాస్ నక్వీపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

బీజేపీ అభ్యర్థి జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సమాజ్‌వాదీపార్టీ అభ్యర్థి ఆజంఖాన్ బాలీవుడ్ సినిమాలో విలన్ ముగాంబో లాంటి వాడని ఆయన అన్నారు. 

ఎన్నికల ప్రచార సభలో నక్వీ ఆజంఖాన్ పై వ్యాఖ్యలు చేశారు. రాంపూర్ అభ్యర్థిపై ముగాంబో అంటూ వ్యాఖ్యలు చేశారని, తద్వారా కేంద్రమంత్రి నక్వీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని మెజిస్ట్రేట్ ఎంకే గుప్తా ఫిర్యాదు చేశారు.

ఆ ఫిర్యాదు మేరకు తాము కేంద్రమంత్రిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రాంపూర్ అదనపు ఎస్పీ అరుణ్ కుమార్ సింగ్ చెప్పారు.