న్యూఢిల్లీ: లోకసభ ఎన్నికల ఐదో విడత పోలింగ్ సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఐదో విడత 7 రాష్ట్రాల్లోని 51 సిట్లకు పోలింగ్ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 14 సీట్లు, రాజస్థాన్ లో 12 సీట్లు, మధ్యప్రదేశ్ లోని 7 సీట్లు సోమవారం పోలింగ్ జరుగుతున్న సీట్లలో ఉన్నాయి.

కాంగ్రెసు ఉద్దండులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న రాయబరేలీ, అమేథీ సీట్లకు నేడు పోలింగ్ జరుగుతోంది. రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పోటీ చేస్తున్నారు. సోనియా గాంధీపై దినేషథ్ ప్రతాబ్ సింగ్ పోటీ చేస్తున్నారు. లక్నోలో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ పై శతృఘ్నసిన్హా సతీమణి పూమేర్ సిన్హా పోటీ చేస్తున్నారు.  

బీహార్ లోని శరన్ సీటులో రాజీవ్ ప్రతాప్ రూఢీపై చంద్రికా రాయ్ తలపడుతున్నారు. రాంచీలో సంజయ్ సేథ్ పై సుబోధ్ కాంత్ సహాయ్ పోటీ చేస్తున్నారు. హజారీబాగ్ లో యశ్వంత్ సిన్హా కుమారుడు జయత్ సిన్హా పోటీ పడుతున్నారు.