హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితంగా మెలుగుతూ వచ్చిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత మమతా బెనర్జీ సేఫ్ గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఆమె విశాఖపట్నంలో ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అయితే, అవసరమైతే చంద్రబాబుకు దూరం కావడానికి కూడా ఆమె సిద్ధపడినట్లు చెబుతున్నారు. 

ఢిల్లీలో అధికారమే కేంద్రంగా మమతా బెనర్జీ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సంబంధాలు నెరుపుతున్నట్లు సమాచారం. ఓ వైపు చంద్రబాబుతో సన్నిహితంగా ఉంటూనే మరోవైపు జగన్ ను తన వైపు తిప్పుకునేందుకు ఆమె పావులు కదుపుతున్నట్లు అర్థమవుతోంది. 

కేంద్రంలో నాన్ ఎన్డీఎ, నాన్ యుపిఎ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ నేతలంతా చర్చలు జరిపి ప్రధాని అభ్యర్థిని ఎంపిక చేసుకుంటారని ఆమె చెప్పారు. 

కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ ఫలితాలే కీలకం కానున్నట్లు ఆమె తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బీహార్, అస్సాం... ఏదైనా కావచ్చు నేతలంతా ఒకతాటి మీదికి వచ్చి కనీస ఉమ్మడి కార్యక్రమం ప్రాతిపదికపై నిర్ణయం తీసుకుంటారని ఆమె చెప్పారు.