న్యూఢిల్లీ: కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి మార్పులు ఉండవని  కేంద్రం ఎన్నికల సంఘం బుధవారం నాడు  స్పష్టం చేసింది. వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు విషయంలో విపక్షాల డిమాండ్‌ను ఈసీ తోసిపుచ్చింది. ఈవీఎంల లెక్కింపు తర్వాతే వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా ఈసీ ప్రకటించింది.

కౌంటింగ్‌ ప్రక్రియలో ఈవీఎంల కంటే ముందుగానే వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని విపక్షాలు ఈసీని కోరాయి. కానీ ఈ విషయంలో విపక్షాల డిమాండ్‌ను ఈసీ తోసిపుచ్చింది.