చెన్నై:తమిళనాడు రాష్ట్రంలో నివసిస్తున్న తెలుగు ప్రజలంతా ఈ ఎన్నికల్లో డీఎంకెకు ఓటు వేయాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కోరారు.

మంగళవారం నాడు చెన్నైలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  మీడియాతో మాట్లాడారు.అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత మరణించిన తర్వాత అన్నాడిఎంకె పార్టీ నేతలు మోడీ చేతిలో రిమోట్‌కంట్రోల్ గా మారారని బాబు ఆరోపించారు.

వచ్చే ఎన్నికల్లో తమిళనాడు ప్రజలంతా  స్టాలిన్‌ సీఎం కావాలని కోరుకొంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో  ఎవరికీ కూడ  వేరే రకమైన నమ్మకాలు లేవన్నారు.  దేశంలోని అన్ని వ్యవస్థలను మోడీ ధ్వంసం చేశారని ఆయన ఆరోపణలు చేశారు.