న్యూఢిల్లీ: తన ఢిల్లీ పర్యటనలో రెండో రోజు శనివారం కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజీగా గడిపారు. ఆయన శనివారం ఉదయం కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు.

కేంద్రంలో బిజెపి తిరిగి అధికారంలోకి రాకుండా చేయడానికి అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు రాహుల్ గాంధీతో చర్చించినట్లు తెలుస్తోంది. భవిష్యత్తు కార్యాచరణపైనే కాకుండా రీపోలింగ్ వంటి వ్యవహారాలపై కూడా ఆయన చర్చించినట్లు తెలుస్తోంది. 

కాగా, చంద్రబాబు మధ్యాహ్నం ఉత్తరప్రదేశ్ కు బయలుదేరి వెళ్లనున్నారు. ఆయన యుపిలో ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తోనూ బిఎస్పీ అధినేత మాయావతితోనూ సమావేశం కానున్నారు. 

ఈ నెల 23వ తేదీన యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ తలపెట్టిన సమావేశానికి మద్దతు కూడగట్టే ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు ఈ పర్యటనలు చేస్తున్నారు.