న్యూఢిల్లీ: దేశంలోని పార్లమెంట్ ఎన్నికలతో పాటు, నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది.ఈ సమావేశంలో ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం నాడు సాయంత్రం ఐదు గంటలకు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఏపీ,ఒడిశా, హిమాచల్ ప్రదేశ్,అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.

అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.  ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల అధికారులు పర్యటించారు. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు గాను ఏర్పాట్లను పూర్తి చేశారు. తొమ్మిది లేదా 10 విడతల్లో ఎన్నికలు పూర్తయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.  అయితే   దీనికి సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది.