Asianet News TeluguAsianet News Telugu

మాయావతి పార్టీకి దిమ్మతిరిగే బ్యాంక్ బ్యాలెన్స్

: దేశంలోనే ఎక్కువ బ్యాంక్ బ్యాలెన్స్ కలిగిన రాజకీయపార్టీగా బీఎస్పీ రికార్డులకెక్కింది. ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన నివేదికలో  ఈ విషయాన్ని ఆ పార్టీ ప్రకటించింది.

BSP Has Biggest Bank Balance Among Parties With Rs 670 Crore in Accounts
Author
New Delhi, First Published Apr 15, 2019, 3:31 PM IST

న్యూఢిల్లీ: దేశంలోనే ఎక్కువ బ్యాంక్ బ్యాలెన్స్ కలిగిన రాజకీయపార్టీగా బీఎస్పీ రికార్డులకెక్కింది. ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన నివేదికలో  ఈ విషయాన్ని ఆ పార్టీ ప్రకటించింది.

బీఎస్పీ సమర్పించిన నివేదికలో తమ పార్టీకి చెందిన 8 బ్యాంకు ఖాతాల్లో రూ.669 కోట్లు ఉన్నాయని ఉన్నాయని స్పష్టం చేసింది. అంతేకాదు మరో రూ.95.54 లక్షలు తమ చేతుల్లో ఉన్నటుగా ఆ పార్టీ వివరించింది.

బీఎస్పీ తర్వాతి స్థానంలో  సమాజ్‌వాదీ పార్టీ నిలిచింది.  ఆ పార్టీకి రూ. 471 కోట్లు పలు బ్యాంకుల్లో ఉన్నాయని వివరించింది.ఈ రెండు పార్టీల తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ నిలిచింది.  కాంగ్రెస్ పార్టీకి రూ. 196 కోట్ల బ్యాంకు నిల్వలున్నాయని ఆ పార్టీ నివేదికలో పేర్కొంది.

నాలుగో స్థానంలో టీడీపీ నిలిచింది.  రూ.107 కోట్ల బ్యాంకు నిల్వలున్నట్టుగా  ఆ పార్టీ ప్రకటించింది. ఆ తర్వాతి స్థానంలో బీజేపీ నిలిచింది. బీజేపీకి కేవలం రూ. 82 కోట్లు మాత్రమే ఉన్నాయని ఆ పార్టీ నివేదించింది. సీపీఎం రూ.3కోట్లు, ఆప్ పార్టీ రూ.3కోట్ల బ్యాంకు బ్యాలెన్స్ కలిగి ఉన్నట్లు ఈసీకి సమర్పించిన నివేదికల్లో వెల్లడైంది. ఇక 2017-18లో బీజేపీ రూ.1,027 కోట్ల విరాళాలు సేకరించగా.. రూ.758 కోట్లను ఎన్నికలలో ఖర్చు  పెట్టినట్లు చూపించింది.

రాజకీయ  పార్టీలు ఆదాయపు పన్ను శాఖకు సమర్పించిన ఐటీ రిటర్న్స్‌లో  2016-17లో రూ.1034 కోట్ల, 2017-18లో రూ. 1,028 కోట్లు విరాళాలుగా వచ్చాయని చెప్పినట్టుగా ఏడీఆర్ సంస్థ ప్రకటించింది.

ఇదే కాలానికి బీఎస్పీ ఆదాయం రూ.174 కోట్ల నుండి రూ. 52 కోట్లకు పడిపోయాయని ప్రకటించింది. కాంగ్రెస్ ఆదాయం కూడ 2016-17లో  రూ.225 కోట్లుగా చూపినట్టుగా ఈ సంస్థ వివరించింది.

Follow Us:
Download App:
  • android
  • ios