నిర్ణీత గడువులోపుగానే లోక్‌సభ ఎన్నికలను నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం  ప్రకటించింది.

న్యూఢిల్లీ: నిర్ణీత గడువులోపుగానే లోక్‌సభ ఎన్నికలను నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న టెన్షన్ వాతావరణం నేపథ్యంలో ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉందనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో సీఈసీ శుక్రవారం నాడు కీలక ప్రకటన చేసింది.

శుక్రవారం నాడు కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీళ్ ఆరోరా లక్నోల్ మీడియాతో మాట్లాడారు. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి రెండు రోజులుగా సీఈసీ సునీల్ అరోరా సమీక్ష నిర్వహిస్తున్నారు.

దేశంలో నిర్ణీత కాల వ్యవధిలోనే ఎన్నికలను నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. దేశంలో ప్రశాంతంగా, నిష్పక్షంగా ఎన్నికలు జరిపేలా అన్ని చర్యలు తీసుకొంటామని ఆయన చెప్పారు. ఏ ఫిర్యాదుపైనైనా కూడ కచ్చితంగా వ్యవహరిస్తామని ఆయన స్పష్టం చేశారు.