న్యూఢిల్లీ: ఆమేథీ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ నేత హజీ సుల్తాన్ ఖాన్ తనయుడు హజీ హరూన్ రషీద్‌ బరిలోకి దిగనున్నారు. పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వని కారణంగానే తనయుడిని బరిలోకి దింపుతున్నట్టుగా ఆయన ప్రకటించారు.

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీని 1991 ఎన్నికల్లో హజీ సుల్తాన్ ఖాన్ ప్రతిపాదిస్తూ నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు. 1999 ఎన్నికల్లో కూడ సోనియాగాంధీ నామినేషన్ పత్రాలపై కూడ హజీ సుల్తాన్ కూడ సంతకం చేశారు. 

తమ వర్గం మొత్తం పార్టీ స్థానిక నాయకత్వం పట్ల అసంతృప్తితో ఉన్నట్టుగా  ఆయన తెలిపారు. తమను కాంగ్రెస్ నాయకత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఈ నియోజకవర్గంలో 6.5 లక్షల ఓటర్లున్నారు. అయితే తామంతా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తామని ఆయన ప్రకటించారు. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా స్మృతి ఇరానీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.