Asianet News TeluguAsianet News Telugu

అవకతవకలకు పాల్పడితే రక్తపాతం సృష్టిస్తాం: ఉపేంద్ర కుష్వహా

కౌంటింగ్ రోజున  అధికార పార్టీ అవకతవలకు పాల్పడితే  ప్రజలు చూస్తూ ఊరుకోరని... అవసరమైతే రక్తపాతం సృష్టిస్తారని  రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీ నేత ఉపేంద్ర కష్వహా హెచ్చరించారు.

"Blood Will Flow": Upendra Kushwaha Warns NDA Against Trying To "Loot Votes"
Author
New Delhi, First Published May 22, 2019, 3:10 PM IST

న్యూఢిల్లీ: కౌంటింగ్ రోజున  అధికార పార్టీ అవకతవలకు పాల్పడితే  ప్రజలు చూస్తూ ఊరుకోరని... అవసరమైతే రక్తపాతం సృష్టిస్తారని  రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీ నేత ఉపేంద్ర కష్వహా హెచ్చరించారు.

మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రైవేట్ వాహనాల్లో ఈవీఎంలను తరలిస్తున్నారని  దీని గురించి ప్రశ్నిస్తే ఎవరూ కూడ సమాధానం చెప్పడం లేదన్నారు.  ఈ పరిణామాలు చూసి జనం ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఇది ఇలానే కొనసాగితే మహా కూటమి కానీ.. ప్రజలు కానీ చూస్తూ ఊరుకోరదని ఆయన హెచ్చరించారు. 

తమ ఓటు తమకు గౌరవం.. జీవనాధారం.. తమ బతుకుల జోలికి వస్తే ఆత్మరక్షణ కోసం ఆయుధాలు చేపట్టి ఎలా పోరాటం చేస్తామో.. అలానే తమ ఓట్ల కోసం కూడ పోరాటం చేస్తామని  చెప్పారు. కౌంటింగ్ రోజున అవకతవకలకు పాల్పడితే హింసాకాండ చేలరేగడం ఖాయమన్నారు.ఎన్డీఏ కూటమి నుండి ఆర్ఎల్‌ఎస్‌పీ బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios