లోక్ సభ ఎన్నికల్లో గెలిచి బిజెపి మరోసారి దేశంలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని భారీ వ్యూహాలతో ముందుకు కదులుతోంది. ముఖ్యంగా దక్షిణాదిలో తమ బలాన్ని మరింత పెంచుకోవడంతో పాటు...బలంగా వున్న రాష్ట్రాల్లో క్లీస్ స్వీప్ చేయాలని  బిజెపి భావిస్తోంది. అందులో భాగంగానే దక్షిణ భారతంలో అత్యధిక లోక్ సభ స్థానాలున్న మహారాష్ట్రను ముందుగా టార్గెట్ చేసింది. అక్కడ మొత్తం లోక్ సభ స్థానాలను తమ ఖాతాలో వేసుకోడానికి బిజెపి ''ఆపరేషన్-45'' వ్యూహాన్ని రచించింది. ఈ లక్ష్యాన్ని సాధించడంలో బిజెపికి అడ్డుగా వున్న ఒకే ఒక స్థానం ''బారామతి'' 

ఇటీవల మహారాష్ట్రలో జరిగిన పార్టీ సమావేశంలో బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా మాట్లాడుతూ... ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాష్ట్రంలోని 45 లోక్ సభ సీట్లు బిజెపి ఖాతాలోనే పడేలా చూడాలన్నారు. ఈ మిషన్ 45 పూర్తి కావాలంటే బారామతి లోక్ సభ నియోజకవర్గంపై కూడా బిజెపి జెండా ఎగరాల్సిందేనని... రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు అక్కడ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి పిలుపునిచ్చారు.  

అదే వేదికపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర పడ్నవీస్ మాట్లాడుతూ...చివరి లోక్ సభ ఎన్నికల్లో బారామతిలో తక్కువ ఓట్ల తేడాతోనే ఓడిపోయామని గుర్తుచేశారు. అక్కడ బిజెపి అభ్యర్థి పోటీ చేసి వుంటే తప్పకుండా గెలిచేవారమని ధీమా వ్యక్తం చేశారు. 2014 లో ఒప్పందంలో భాగంగా బారామతి స్ధానంలో రాష్ట్రీయ సమాజ్ పక్ష పార్టీకి చెందిన మహదేవ్ జన్కర్ కు బిజెపి సపోర్ట్ చేసింది. దీంతో ఎన్సీపి పార్టీ అభ్యర్థి చేతిలో ఆయన 69 వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడు. 

బారామతి లోక్ సభ స్థానం ఎన్సీపి(నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీ)  కంచుకోట. అక్కడ ఇప్పటివరకు శరత్ పవార్ ను ఎదిరించి గెలిచిన నాయకుడు లేడు. అందువల్లే బిజెపి ఆ సీటుపై కన్నేసింది. 

1984 లో మొదటిసారి కాంగ్రెస్ పార్టీ తరపున శరత్ పవార్ బారామతి లోక్ సభకు పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు. ఇలా ఆయన దాదాపు 6 సార్లు బారామతి నుండి ఒక్కసారి మాత్రం మదా నుండి  గెలిచారు. 2004 లో అయితే పవార్ ఏకంగా 4లక్షల 22వేల ఓట్ల బారీ మెజారితో గెలుపొందారు.

భారామతిలో  పవార్ హవా గురించి ఓ స్థానిక నాయకుడు మాట్లాడుతూ...ఇక్కడ తమ నాయకుడు పవార్ పెద్దగా ప్రచారం నిర్వహించకుండానే గెలుస్తాడని  అన్నాడు. ఎన్నికల సమయంలో ఆయన కేవలం ఒకటి రెండు సార్లు మాత్రమే బారామతిలో ప్రచారం నిర్వహిస్తారని...మిగతా సమయంలో ఇతర స్థానాల్లోని అభ్యర్థుల ప్రచారంలో పాల్గొంటారని  తెలిపారు. అయినా కూడా ఆయన గెలుస్తారని...ఇక్కడి ప్రజలకు శరద్ పవార్ అంటే అంత ప్రేమ, నమ్మకమని తెలిపారు. 

ఇలా పార్టీకి కంచుకోటైన భారామతి నుండే పవార్ తన వారసురాలిని రాజకీయాలకు పరిచయం చేశారు.  2009 లో పవార్ తన కూతురు సుప్రియా సూలేను ఇక్కడి నుండి బరిలోకి దించారు. తండ్రి లాగే అమెను కూడా అక్కున చేర్చుకున్న అక్కడి ప్రజలు మూడు లక్షల పైచిలుకు మెజారిటీతో గెలిపించారు.  2014 లో  దేశం మొత్తం బిజెపి పవనాలు బలంగా వీచినాచ మోదీ హవా కొనసాగినా భారామతిలో మాత్రం సుప్రియనే గెలిచారు. కానీ మెజారిటీ మాత్ర 69 వేలకు తగ్గింది. 

దీంతో ఎన్సిపిని దెబ్బతీయాలంటే భారామతిలో ఓడించడమే మార్గమని భావించిన బిజెపి అక్కడ బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలని చూస్తోంది. అయితే సుప్రియా సూలే కూడా హ్యాట్రిక్ విజయం తనదేనంటూ ధీమాగా వున్నారు. దీంతో భారామతి లోక్ సభ ఈ సారి ఎన్నికల్లో హాట్ టాపిక్ గా మారనుంది.