Asianet News TeluguAsianet News Telugu

Digital Eye Strain: ఎక్కువ సేపు కంప్యూటర్ లో వర్క్ చేస్తున్నారా? అయితే ఈ విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే.

Digital Eye Strain: కంప్యూటర్ లో  ఎక్కువ సేపు వర్క్ చేస్తున్నారా? అయితే మీరు ఆ ప్రమాదంలో పడ్డట్టే..  ఎక్కువ సేపు స్క్రీన్ చూడటం వల్ల కంటి చూపు పై తీవ్ర ప్రభావం పడుతుంది. కంప్యూటర్ పై ఎక్కువ సేపు వర్క్ చేయడం వల్ల కలిగే నష్టాలేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం..
 

you have digital eye strain follow these steps to combat it
Author
Hyderabad, First Published Jan 17, 2022, 5:08 PM IST

Digital Eye Strain: కంప్యూటర్ లో  ఎక్కువ సేపు వర్క్ చేస్తున్నారా? అయితే మీరు ఆ ప్రమాదంలో పడ్డట్టే..  ఎక్కువ సేపు స్క్రీన్ చూడటం వల్ల కంటి చూపు పై తీవ్ర ప్రభావం పడుతుంది. కంప్యూటర్ పై ఎక్కువ సేపు వర్క్ చేయడం వల్ల కలిగే నష్టాలేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం..
Digital Eye Strain: కంప్యూటర్ పై వర్క్ చేయడం వల్ల లాభాలే తప్ప నష్టాలేమీ ఉండవని చాలా మంది భావిస్తుంటారు. కానీ కంప్యూటర్ పై ఎక్కువ సేపు పని చేయడం వల్ల ఎన్నో రకాల సమస్యలు అటాక్ చేసే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కళ్లు Stress కి గురయ్యే ప్రమాదం పొంచి ఉంది. 100 లో 80 శాతం ప్రజలు కంప్యూటర్ స్క్రీన్ చూసే టైం పెరిగిపోయిందని ఓ అధ్యయనం వెళ్లడించింది. దీని మూలంగా వారి కళ్లపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెరిగిపోతుందని నిపుణులు వెళ్లడిస్తున్నారు. ఈ సమస్య సంవత్సరం క్రితం కంటే ప్రస్తుతం కళ్ల సమస్య మరీ దారుణంగా పెరిగిందని అధ్యయనాలు వెళ్లడిస్తున్నాయి. ఇందులో చాలా మంది కంటి చూపు మందగించడం ప్రారంభమైందని హెచ్చరిస్తున్నారు. కంటికి Stress నుంచి ఉపశమనం పొందాలంటే.. ఈ చిట్కాలను పాటించండి.

కారణాలు: కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ స్క్రీన్ ను ఎక్కువ సేపు చూడటం వల్ల కంటిపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెరుగుతుంది. అంటే ఆ స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ నేరుగా కళ్లపై పడుతుంది. దీని వల్ల కళ్లు తీవ్ర స్థాయిలో ఒత్తిడికి గురికావొచ్చు.

లక్షణాలు: కళ్లపై ఒత్తిడి అధికంగా పడ్డప్పుడు కంటి చూపు సరిగ్గా లేకపోవడం, కండ్ల నుంచి నిరంతరం నీళ్లు కారుతుండటం, తలనొప్పి, గొంతు నొప్పి, కండ్లు పొడిబారడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కొందరిలో కంటి చూపు బాగానే ఉన్నప్పటికీ స్క్రీన్ను ఎక్కువ సేపు విరామం లేకుండా చూడటం వల్ల కండ్లు అలసటకు గురవుతాయి. వీటన్నింటికి పరిష్కార కొన్ని మార్కాలు ఉన్నాయి. స్క్రీన్ బ్లూ లైట్ ను తగ్గించాలి. అలాగే యాంటీ రెఫ్లెక్టిక్ లెన్స్ ను ఉపయగించడం వల్ల కళ్లను ఒత్తిడికి గురికాకుండా చూడొచ్చని నిపుణులు వెళ్లడిస్తున్నారు. ఇలా చేయడం వల్ల కళ్లపై బ్లూ లైట్ ప్రభావం చాలా వరకు తగ్గుతుంది. అలాగే కళ్లు స్ట్రెస్ కు గురికాకుండా ఉండాలంటే ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ ను ఉపయోగించడం చాలా ఉత్తమం. ఒకవేళ ఇవి వాడకపోతే బ్లూలైట్ ను తగ్గించే  Glasses ను ఉపయోగించాలి. వీటితో పాటుగా యాంటీ రిఫ్లెక్టివ్ లెన్స్ ను ఉపయోగించడం బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఎక్కువ సేపు స్క్రీన్ ను చూడకూడదు. ప్రతి 20 నిమిషాలకొకసారి వేరే వస్తువులను చూపు తిప్పకుండా 20 సెకన్లు చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల మీ కళ్లు కాస్త రీఫ్రెష్ గా ఫీలవుతాయి. ముఖ్యంగా కళ్లపై ఒత్తిడి కూడా కాస్త తగ్గుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే స్క్రీన్ ను చూసేటప్పుడు మధ్య మధ్యలో కను రెప్పలు వాలుస్తూ ఉండాలి. ఇలా మధ్య మధ్యలో చేయడం  కళ్లు పొడిబారకుండా ఉండటంతో పాటుగా కంటి ఒత్తిడి సమస్య కూడా దూరం అవుతుంది.   

Follow Us:
Download App:
  • android
  • ios