World Blood Donor Day 2022: సకాలంలో రక్తం అందక రోజుకు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రక్తదానం ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రతి సంవత్సరం జూన్ 14 న ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. ఈ రోజును ఎప్పుడు ప్రారంభించారు? World Blood Donor Day 2022 థీమ్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

World Blood Donor Day 2022: సకాలంలో రక్తం అందక రోజుకు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రక్తదానం ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రతి సంవత్సరం జూన్ 14 న ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. ఈ రోజును ఎప్పుడు ప్రారంభించారు? World Blood Donor Day 2022 థీమ్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

అన్ని దానాల్లో రక్తదానం ఎంతో గొప్పది. ఎందుకంటే ఈ రక్తమే ఒక వ్యక్తిని బతికిస్తుంది. కాగా మానవత్వాన్ని గౌరవించడానికి ప్రతి ఏడాది జూన్ 14 న ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని (World Blood Donor Day ) జరుపుకుంటారు. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ (International Federation of Red Cross), ది రెడ్ క్రెసెంట్ సొసైటీ (The Red Crescent Society), ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్స్ (International Federation of Blood Donor Organizations), ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ ఫ్యూజన్ సహకారంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాయి. ఈ ఏడాది ప్రపంచ రక్తదాత దినోత్సవాన్ని మెక్సికో నగరం నిర్వహిస్తుంది. ఇక్కడ జూన్ 14, 2022 న దాని నేషనల్ బ్లడ్ సెంటర్ లో ఒక గ్లోబల్ ఈవెంట్ నిర్వహించబడుతుంది.

ప్రపంచ రక్తదాతల దినోత్సవం 2022 థీమ్: ప్రతి సంవత్సరం ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ఒక థీమ్ తో జరుపుకుంటారు. 'ఇతరుల కోసం జీవించండి, రక్తం ఇవ్వండి, జీవితాన్ని పంచుకోండి' అనే సందేశంతో ఈ రోజును జరుపుకుంటున్నారు. ప్రసూతి చికిత్స సమయంలో ప్రమాదాలు, క్యాన్సర్ లు, కార్డియోవాస్కులర్ వంటి సమస్యలకు రక్తం చాలా అవసరం అవుతుంది. అయితే ప్రమాదంలో ఉన్నవారికి సకాలంలో రక్తం అందడం లేదు. దీని వల్ల చాలా మంది ఆసుపత్రుల్లోనే (hospitals)మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని చాలా దేశాల్లోని ప్రభుత్వాలు, అంతర్జాతీయ, స్థానిక సంస్థలు రక్తదానంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాయి.

అవసరమైన రోగులకు రక్తం అందేలా చూడటం, దాని భద్రత, ప్రతిచోటా రక్తం లభ్యం కావడం అనేది ప్రపంచ రక్తదాతల దినోత్సవం యొక్క ప్రాముఖ్యత. రక్తదానం గురించి అవగాహన కల్పించడం ప్రపంచ రక్తదాత దినోత్సవం లక్ష్యం. ఈ రోజు ద్వారా రక్తదాతకు కృతజ్ఞతలను తెలియజేయడమే ఈ రోజు ప్రత్యేకత.

జూన్ 14 నే దీనిని ఎందుకు జరుపుకుంటారు?

రక్తదానం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రతి సంవత్సరం జూన్ 14 న ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. అలాగే ఆస్ట్రియన్ వైద్యుడు Carl Landsteiner మనుషుల మూడు బ్లడ్ గ్రూప్ లను కనుగొన్నాడు. ఆయన పుట్టినరోజైన జూన్ 14ను ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా కూడా జరుపుకుంటారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం అక్టోబర్ 1వ తేదీని జాతీయ రక్తదాతల దినోత్సవం (National Blood Donor Day)గా జరుపుకుంటారు.

భారతదేశానికి ప్రతి ఏడాది 5 కోట్ల యూనిట్ల రక్తం అవసరం. అయితే కేవలం 2.5 కోట్ల యూనిట్ల రక్తం మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రతి రెండు సెకన్లకు దేశంలో రక్తం అవసరం అవుతుంది. ప్రతి సంవత్సరం ౩ కోట్ల రక్త యూనిట్లు నిండిపోతాయని అంచనా. Sickle cellరోగులకు వారి జీవితాంతం బ్లడ్ ను మార్పిడి చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే భారతదేశంలో ప్రతి సంవత్సరం 10 లక్షల మంది క్యాన్సర్ తో బాధపడుతున్నారని అంచనా. వీరిలో చాలా మందికి కీమోథెరపీ సమయంలో కొన్నిసార్లు రక్తమార్పిడి చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు క్రమం తప్పకుండా రక్తమార్పిడి చేయాల్సి ఉంటుంది. కానీ ఈ రక్తం అందని వారు చాలా మంది ఉన్నారు.