Asianet News TeluguAsianet News Telugu

భర్త మృతి.. కుటుంబ పోషణ కోసం రైతుగా మారిన మహిళ.. ఏటా సంపాదన తెలిస్తే షాక్?

ప్రపంచం రోజురోజుకు కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తూ ముందుకు వెళుతున్నప్పటికీ కొందరు మాత్రం మహిళల పట్ల ఇప్పటికీ వివక్షత చిన్న చూపు చూస్తూనే ఉన్నారు. మహిళలంటే కేవలం ఇంటికి మాత్రమే పరిమితం అయ్యేవారని కొందరు భావిస్తున్నారు. అయితే మహిళలంటే కేవలం ఇంటికి మాత్రమే కాదు ఏ పనినైనా ఏ రంగంలోనైనా తమ సత్తా చాటగలమని ప్రస్తుత కాలంలో మహిళలు కూడా పురుషులతో దీటుగా ముందుకు నడుస్తున్నారు.

women earns 30 lakhs per year with farming know this inspirational story
Author
Hyderabad, First Published Aug 5, 2022, 4:04 PM IST

ఈ విధంగా నువ్వు మహిళవు నీకేం చేతకాదు అంటూ హేళన చేయబడిన చోటే ప్రస్తుతం అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నారు రైతు సంగీత. పిల్లలు చిన్నగా ఉన్న సమయంలోనే భర్త చనిపోవడంతో ఆమె ఒంటరిగా తన కుటుంబాన్ని ఎలా ముందుకు నడిపించారు ఎలాంటి అవమానాలను ఎదుర్కొన్నారు అనే విషయానికి వస్తే..

నాసిక్‌లోని మాటోరి గ్రామానికి చెందిన సంగీత పింగలే  అనే మహిళా2007వ సంవత్సరంలో తన భర్తను కోల్పోయింది. ఇక తన కుటుంబ సభ్యుల అండతో తన కూతురు కొడుకును చదువులు కొనసాగిస్తూ జీవితాన్ని గడుపుతున్న సంగీత ఉమ్మడి కుటుంబంలో కలహాలు రావడంతో తన అత్తమామలను పిల్లలను తీసుకొని బయటకు వెళ్ళింది. ఇక తన మామయ్య నుంచి తనకు వచ్చిన 13 ఎకరాల పొలం మాత్రమే తనకున్న ఆదాయవనరు. ఇక పొలం పనులు చేయడం తప్ప తనకు ఏ విధమైనటువంటి ఆధారం లేదు. అయితే తన కుటుంబం నుంచి విడిపోయిన రెండు నెలలకే తన మామయ్య కూడా చనిపోవడంతో ఈమె ఎంతో కృంగిపోయింది.

కుటుంబ పెద్దలందరిని కోల్పోయి ఎంతో కృంగిపోయిన ఈమె తన అన్నయ్యల సహకారంతో వ్యవసాయ పనులు ఎలా చేయాలో నేర్చుకుంది.మొదట్లో వ్యవసాయం చేస్తానని చెప్పగా ఇది ఆడవాళ్లు చేసే పని కాదు నువ్వు చేయలేవు అంటూ తనని అడ్డుకున్నారు. అయితే తాను మాత్రం ఎవరి మాట వినకుండా తన సోదరుల సహాయంతో వ్యవసాయ పనులు ఎలా చేయాలి? ఎలాంటి విత్తనాలను ఎంపిక చేయాలి వాటిని ఎలా రవాణా చేయాలి అనే విషయాలు గురించి తెలుసుకుంది. ఇక వ్యవసాయంలో మగవారు మాత్రమే చేసే కొన్ని పనులు పై కూడా ఈమె దృష్ట పెట్టింది.ట్రాక్టర్ నడపడం అలాగే ఏదైనా పరికరాలు చెడిపోతే వాటిని రిపేర్ చేసుకోవడం వంటి పనులను కూడా నేర్చుకుంది.

ఈ విధంగా వ్యవసాయంలో అన్ని మెలకువలు నేర్చుకున్న సంగీత ప్రతి ఏడాది సుమారు వెయ్యి టన్నులకు పైగా ద్రాక్ష పండిస్తున్నారు. ఇలా సంవత్సరానికి ఏకంగా ఈమె 30 లక్షల వరకు ఆదాయం పొందుతూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు. ప్రస్తుతం తన కూతురు గ్రాడ్యుయేషన్ చదవగా తన కుమారుడు సైతం మంచి కాలేజీలో ఉన్నత చదువులు చదువుతున్నారని సంగీత వెల్లడించారు.

Follow Us:
Download App:
  • android
  • ios