MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • గ్ర‌హ‌ణ స‌మ‌యంలో భార్యాభ‌ర్త‌లు క‌ల‌వ‌కూడ‌దా.? శాస్త్రం ఏమంటోంది, సైన్స్ ఏం చెబుతోంది.

గ్ర‌హ‌ణ స‌మ‌యంలో భార్యాభ‌ర్త‌లు క‌ల‌వ‌కూడ‌దా.? శాస్త్రం ఏమంటోంది, సైన్స్ ఏం చెబుతోంది.

Chandra Grahan: ఈ ఏడాది తొలి చంద్రగ్రణం నేడు (మంగళవారం) ఏర్పడనుంది. పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడుతుండడం ఎంతో ప్రాముఖ్యత అని పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రహణానికి సంబంధించి ఉన్న కొన్ని ప్రశ్నలు, వాటి సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Narender Vaitla
Published : Mar 03 2026, 07:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చంద్రగ్రహణం సమయం
Image Credit : Getty, Gemini AI

చంద్రగ్రహణం సమయం

మంగళవారం సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించనుంది. మధ్యాహ్నం 3:21 గంటలకు ప్రారంభమై రాత్రి 7:52 వరకు కొనసాగుతుంది. భారతదేశంలో ఇది పాక్షికంగా కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో సూర్యాస్తమయం తర్వాత సాయంత్రం 6:20 నుంచి 6:47 వరకు దాదాపు 27 నిమిషాల పాటు చంద్రుడిపై గ్రహణ ప్రభావం స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది.

25
ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు
Image Credit : TTD.com

ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు

గ్రహణాన్ని పురస్కరించుకుని అనేక దేవాలయాలను మూసివేస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7:30 వరకు ఆలయ ద్వారాలు మూసివేస్తారు. రాత్రి 7:30కి తలుపులు తెరిచి శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు. 8:30కి భక్తులకు దర్శనం ప్రారంభమవుతుంది. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఉదయం 7 గంటల నుంచి మరుసటి రోజు వేకువజామున 3 వరకు ఆలయం మూసి ఉంటుంది. అనంతరం సంప్రోక్షణ పూజల తర్వాత భక్తులను అనుమతిస్తారు.

Related Articles

Related image1
TTD: తిరుమల శ్రీవారిని నిజంగానే 15 నిమిషాలు దర్శించుకోవచ్చా.? ఇందులో నిజ‌మెంత
Related image2
పేమెంట్ అయిన‌ట్లు సౌండ్ వ‌స్తుంది కానీ డ‌బ్బులు ప‌డ‌వు.. ఫోన్‌పేలో కొత్త స్కామ్‌. జాగ్ర‌త్త‌!
35
గ్రహణం సమయంలో శారీకంగా కలవొచ్చా?
Image Credit : Getty

గ్రహణం సమయంలో శారీకంగా కలవొచ్చా?

భారతీయ సంస్కృతిలో గ్రహణాన్ని “సూతక కాలం”గా పరిగణిస్తారు. ఈ సమయంలో కొన్ని ఆచారాలు పాటిస్తారు. వీటిలో ప్రధానమైవని ఆహారం వండకూడదు, తినకూడదు అని నమ్మకం. గర్భిణీలు బయటకు వెళ్లకూడదని పెద్దలు సూచిస్తారు. మొక్కలు కోయడం, ఆకులు తెంపడంలాంటివి చేయకూడదని అంటారు. గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి ఇంటిని శుభ్రపరచాలి. దానం, జపం, ప్రార్థనలు చేయడం మంచిదని భావిస్తారు.

ఇక గ్రహణ సమయంలో శారీరక కలయికకు దూరంగా ఉండాలని చెబుతుంటారు. ఆ సమయంలో గర్భం దాల్చితే పుట్టబోయే శిశువుపై ప్రభావం ఉంటుందని చెబుతారు. అందుకే ఒకవేళ శారీరకంగా కలిసినా గర్భం దాల్చకుండా జాగ్రత్త వహించాలని చెబుతున్నారు.

45
శాస్త్రీయ దృక్కోణం ఏమంటోంది?
Image Credit : Getty

శాస్త్రీయ దృక్కోణం ఏమంటోంది?

చంద్రగ్రహణం అనేది సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖలోకి వచ్చినప్పుడు భూమి నీడ చంద్రుడిపై పడటం వల్ల ఏర్పడే సహజ ఖగోళ ప్రక్రియ. ఇందులో ఎలాంటి అపశకునాలు లేదా ప్రతికూల శక్తులు ఉండవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది పూర్తిగా ఒక ఖగోళ ప్రక్రియ మాత్రమే అని ఇందులో ఎలాంటి అపోహలు అవసరం లేదని శాస్త్రం చెబుతోంది.

55
గ్రహణ సమయంలో ఏం చేయాలి.?
Image Credit : ANI

గ్రహణ సమయంలో ఏం చేయాలి.?

ఓవైపు శతాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయాలు, మరోవైపు ఆధునిక శాస్త్రం. ఈ రెండింటి మధ్య చాలా మంది గందరగోళానికి గురవుతారు. గ్రహణ సమయంలో ఏం చేయాలి అన్నది వ్యక్తిగత విశ్వాసాలపై ఆధార‌ప‌డి ఉంటుంది. సంప్రదాయాలను గౌరవించే వారు ఆచారాలు పాటిస్తే మనశ్శాంతి పొందవచ్చు. శాస్త్రీయ దృక్కోణాన్ని అనుసరించే వారు సాధారణ దినచర్యను కొనసాగించవచ్చు. అంతిమంగా మ‌న న‌మ్మ‌కాన్ని విశ్వ‌సించి దానిని పాటించ‌డం ఉత్త‌మం.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆధ్యాత్మిక విషయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Brahma Muhurtam: బ్రహ్మ ముహూర్తంలో ఈ 2 పనులు చేస్తే ఎంతో శుభం, ఇంతకీ బ్రహ్మ ముహూర్తం అంటే?
Recommended image2
Shivratri: మహా శివరాత్రి రోజున శివయ్య పూజలో వీటిని మాత్రం వాడకూడదు, ఎందుకో తెలుసా?
Recommended image3
కోటి రూపాయ‌లు ఇచ్చినా స‌రే.. ఈ 7 ప్ర‌దేశాల‌కు అస్స‌లు వెళ్ల‌కండి. చాణ‌క్య ఇలా ఎందుకు చెప్పారంటే
Related Stories
Recommended image1
TTD: తిరుమల శ్రీవారిని నిజంగానే 15 నిమిషాలు దర్శించుకోవచ్చా.? ఇందులో నిజ‌మెంత
Recommended image2
పేమెంట్ అయిన‌ట్లు సౌండ్ వ‌స్తుంది కానీ డ‌బ్బులు ప‌డ‌వు.. ఫోన్‌పేలో కొత్త స్కామ్‌. జాగ్ర‌త్త‌!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved