పెళ్లిలో అయినా, హోటల్లో అయినా.. భోజనం చేసిన తర్వాత ఇలా అస్సలు చేయకండి
అది పెళ్లైనా కానీయండి, ఫంక్షన్, ధావత్, హోటల్ అయినా కానీయండి.. వీటిలో ఎక్కడ తిన్నా మనం తిన్న తర్వాత చేతిని కడిగి వెంటనే నోట్లో నీళ్లు పోసుకుని పుక్కిలిస్తుంటాం. కానీ ఇలా చేయడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే?
తినే ముందు చేతులను పక్కాగా కడుక్కుంటాం. కొంతమంది అయితే నోటిని కూడా కడుగుతుంటారు. అంటే నోట్లో నీళ్లు పోసి పుక్కిలిస్తుంటారు. ఇది మంచి అలవాటే. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం అస్సలు మంచిది కాదు. మనలో చాలా మంది పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు, ధావత్ లకు, ఫ్రెండ్స్ తో, ఫ్యామిలీతో హోటల్ కు వెళ్లినప్పుడు పైపుల నుంచి వచ్చే నీళ్లతో నోటిని కడుక్కుంటుంటారు.
అలాగే పెళ్లి మండపాల్లో భోజనం చేసిన తర్వాత చేతులను కడుక్కోవడంతో పాటుగా నోట్లో నీళ్లు పోసుకుని పుక్కిలిస్తుంటారు. దీనివల్ల నోరు క్లీన్ అవుతుందని అనుకుంటుంటారు. కానీ ఈ అలవాటు మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
హోటల్ నీళ్లను వాడితే ఏమౌతుంది?
ఎందుకంటే ఈ ఆధునిక కాలంలో ఎక్కడ తాకినా.. ఎన్నో అంటువ్యాధులు మనకు అంటుకుంటున్నాయి. వైరస్, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవుల ద్వారా కొత్త కొత్త అంటువ్యాధులు మనకొస్తాయి. అయితే మన ఆహారపు అలవాట్లలో వచ్చి మార్పు వల్ల చాలా మందికి ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. దీనివల్ల వీరికి చాలా తొందరగా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. అందుకే మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావొద్దంటే మాత్రం మీరు ఖచ్చితంగా పరిశుభ్రతను పాటించాలి. జాగ్రత్తగా ఉండాలి.
ఆరోగ్యంగా ఉండాలంటే మీరు బయటకు వెళ్లినప్పుడు పబ్లిక్ టాయిలెట్లలో ఉన్న పైపు లైన్ల నీటిని వాడకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వీలైనంత వరకు ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తినండి. బయటి ఫుడ్ ను అవాయిడ్ చేయండి. అలాగే పరిశుభ్రంగా ఉండాలి. హోటల్ అయినా, కల్యాణ మండపాల్లో అయినా ట్యాప్ వాటర్ తో నోటిని శుభ్రం చేయకండి. ఎందుకంటే ఇలాంటి వాటర్ ట్యాంక్ లు శుభ్రంగా ఉండవు. ఇవి నీళ్ల ద్వారా మనకు ఎన్నో వ్యాధులు వచ్చేలా చేస్తాయి.
ఇంట్లో లాగ పెళ్లి మండపాల్లో ట్యాప్ వాటర్ ను రోజూ ఉపయోగించరు. దీంతో అక్కడుండే ఓవర్ హెడ్ ట్యాంకుల్లోని వాటర్ రోజూ బయటకు పంపింగ్ కాదు. చాలా రోజుల పాటు నీరు పైపుల్లోనే నిలిచిపోతుంది. దీంతో ఆ వాటర్ కలుషితమవుతుంది. నిలిచిన నీళ్లలో సూక్ష్మజీవులు ఉండే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే మీ ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవారు ఈ వాటర్ తో గార్గిల్ చేస్తే బ్యాక్టీరియా, వైరస్లు గొంతు ఇన్ఫెక్షన్ కు కారణమవుతాయి. అందుకే పెళ్లి మండపంలో భోజనం చేసిన తర్వాత నోటిని ట్యాప్ వాటర్ తో కడగకండి. ఒకవేళ కడుక్కోవాలనుకుంటే తాగడానికి ఇచ్చే వాటర్ ను వాడండి.
ఇది జస్ట్ పెళ్లిళ్లకే కాదు హోటళ్లకు కూడా వర్తిస్తుంది. చాలా మంది హోటల్ లో తిన్న తర్వాత చేతులు కడుగుతారు. ఆపై నోట్లో నీళ్లు పోసి పుక్కిలిస్తుంటారు. ముఖ్యంగా నాన్ వెజ్ తిన్న తర్వాత నోట్లో నుంచి దుర్వాసన రాకుండా ఉండాలని, దంతాలను సరిగ్గా శుభ్రపరుచుకోవాలని ఇలా చేస్తుంటారు. కానీ హోటల్ ట్యాప్ నుంచి వచ్చే వాటర్ శుభ్రంగా ఉంటాయో, లేదో తెలియదు. ఇలాంటి వాటర్ తో పుక్కిలిస్తే మీకు అంటువ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఫంక్షన్ హాల్ లేదా హోటల్లో ఎందుకు గార్గిల్ చేయకూడదు?
- ఇక్కడ నీళ్లు శుభ్రంగా ఉంటాయో, లేదో తెలియదు. అంతేకాకుండా ఇక్కడి వాటర్ ట్యాంకులను సక్రమంగా శుభ్రంగా చేస్తారన్న నమ్మకం కూడా ఉండదు.
- అలాగే నీటిని శుద్ధి ప్రక్రియ ఇంట్లో ఉన్నట్టుగా బయటి ప్రదేశాల్లో ఉండకపోవచ్చు.
- ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకుల్లో బ్యాక్టీరియా, వైరస్ లు, పరాన్నజీవులు, ఏవైనా లోహాలు లేదా రసాయనాలు కలవొచ్చు. అందులోనూ ఈ నీళ్లు చాలా కాలంగా అలాగే నిల్వ ఉంటాయి. దీంతో నీటి కనెక్షన్ పైపులు తుప్పు పట్టే అవకాశం ఉంది. అందుకే ఈ వాటర్ గార్గ్లింగ్ చేయొద్దని ఆరోగ్య నిపుణులు చెబుతారు.
- ఇలాంటి వాటర్ వల్ల మీకు టైఫాయిడ్, కలరా, డయేరియా వంటి నీళ్ల ద్వారా వచ్చే వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఈ వాటర్ వల్ల కొంతమందికి జీర్ణశయాంతర అంటువ్యాధులు వస్తాయి. అలాగే చిగుళ్లు వంటి నోటి ఇన్ఫెక్షన్లు, దంత క్షయం వంటి సమస్యలు కూడా వస్తాయి. ఇకపోతే నీళ్లలో ఎలాంటి మలినాలు ఉన్నా మీకు చర్మ చికాకు, అలర్జీ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఇకపై ఈ అలవాటును మానుకోండి.